Pratima Bhowmik : త్రిపుర సీఎం రేసులో ప్రతిమా భౌమిక్
ఇంతకూ ఎవరీమె..ఎందుకంత ప్రయారిటీ
Pratima Bhowmik : త్రిపురలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ప్రతిమా భౌమిక్(Pratima Bhowmik) కాబోతున్నారా. ఇదే విషయాన్ని బీజేపీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చిందా అన్న అనుమానం రాక తప్పదు. గత కొన్నేళ్లుగా త్రిపురలో వామపక్షాలదే పవర్. 2018లో అనూహ్యంగా బీజేపీ ఇక్కడ పాగా వేసింది. తాజాగా 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి మిత్రపక్షంతో కలిసి జజెండా ఎగుర వేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.
ఈశాన్య ప్రాంతంలో త్రిపుర, నాగాలాండ్ , మేఘాలయలలో ఎన్నికలు జరిగాయి. అన్ని చోట్లా బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయనుంది. ఇక త్రిపురలో ప్రస్తుతం సీఎంగా బీజేపీకి చెందిన మాణిక్ సాహా ఉన్నారు. కానీ ఈసారి ఆయన స్థానంలో కేంద్ర మంత్రిగా ప్రస్తుతం ఉన్న ప్రతిమ భౌమిక్ సీఎం కానున్నట్లు సమాచారం. ఆమె కూడా ఆయనతో పాటు రేసులో కొనసాగుతుండడం విశేషం.
ఇదిలా ఉండగా గుర్తింపు సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న ఈశాన్య ప్రాంతాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తగిన రీతిలో గౌరవం ఇచ్చారని ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రతిమ భూమిక్. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ కంచు కోటగా భావించే ధన్ పూర్ సీటును గెలుచుకున్నారు ఆమె.
ప్రస్తుతం కేంద్ర సాధికారత సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు . త్రిపురలో బీజేపీ 32 సీట్లు , టిప్రా మోతా పార్టీ 13 సీట్లు గెలుచుకున్నాయి. సీపీఎం 11 సీట్లు దక్కించు కోగా కాంగ్రెస్ కు 3 సీట్లు వచ్చాయి. ఇక్కడ మొత్తం 60 సీట్లు. ఇక ప్రతిమా భౌమిక్(Pratima Bhowmik) ను త్రిపుర దీదీ అని పిలుస్తారు. 1991 నుంచి బీజేపీలో ఉన్నారామె.
Also Read : మేఘాలయ కేబినెట్ లో చేర్చుకోండి