Hardik Pandya : యుద్దానికి సిద్దం విజ‌యం ఖాయం

ఐపీఎల్ లో స‌త్తా చాటేందుకు రెడీ

Hardik Pandya : ఈనెల 26 నుంచి ఐపీఎల్ సంబురం ప్రారంభం కానుంది. క‌రోనా కార‌ణంగా ముంబై లోనే ఐపీఎల్ 15వ సీజ‌న్ రిచ్ లీగ్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించి బీసీసీఐ.

దీంతో ముంబై ఇండియ‌న్స్ ముంబై న‌గ‌రం అంత‌టా పాల్గొనే జ‌ట్ల‌కు డిఫ‌రెంట్ గా సాద‌ర స్వాగతం ప‌లుకుతోంది. ఆయా జ‌ట్ల‌కు సంబంధించి హోర్డింగ్ లు ఏర్పాటు చేసింది.

ఇప్ప‌టికే పాల్గొనే 10 జ‌ట్ల ఆట‌గాళ్లు ప్రాక్టీస్ లో మునిగి పోయారు. వారం రోజులే ఉండ‌డంతో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది అంతటా. ప్ర‌పంచంలోనే అత్యంత ఆదాయం క‌లిగిన లీగ్ గా ఐపీఎల్ పేరొందింది.

ఒక్క బీసీసీఐ ఆదాయం ఏకంగా రూ. 50 వేల కోట్ల‌కు చేరుకునే చాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. ఈ సంద‌ర్బంగా గుజ‌రాత్ టైటాన్స్ స్కిప్ప‌ర్ గా ఉన్న హార్దిక్ పాండ్యా (Hardik Pandya)సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.

ఇటీవల పూర్ పర్ ఫార్మెన్స్ కార‌ణంగా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. దీంతో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌పంచంలో ఏ ఆట‌గాడు అయినా ఎల్ల‌కాలం ఒకేలా ఆడ‌లేడ‌న్నాడు.

తాను ఐపీఎల్ జ‌రిగే యుద్దం కోసం సిద్ద‌మై ఉన్నాన‌ని, తాను సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నాన‌ని చెప్పాడు. ఇదిలా ఉండ‌గా గ‌త ఏడాది ఐపీఎల్ లో ముంబై ఇండియ‌న్స్ కు ప్రాతినిధ్యం వ‌హించాడు హార్దిక్ పాండ్యా(Hardik Pandya).

ఇటీవ‌ల బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలంలో గుజ‌రాత్ టైటాన్స్ పాండ్యాను రూ. 15 కోట్ల‌కు చేజిక్కించుకుంది. 12 మ్యాచ్ లు మాత్ర‌మే ఆడిన పాండ్యా కేవ‌లం 127 ర‌న్స్ మాత్ర‌మే చేని నిరాశ ప‌రిచాడు.

ఫామ్ కోల్పోయిన పాండ్యాకు కెప్టెన్ గా గుజ‌రాత్ ఛాన్స్ ఇవ్వ‌డం ప్ర‌తి ఒక్క‌రిని విస్తు పోయేలా చేసింది.

Also Read : బాబ‌ర్ ఆజ‌మ్ అద్భుత‌మైన కెప్టెన్

Leave A Reply

Your Email Id will not be published!