Misbah Ul Haq : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ , ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్ (Misbah Ul Haq) సంచలన కామెంట్స్ చేశాడు. చైర్మన్ లేదా సిఇఓలను మారుస్తూ పోతే ప్రదానంగా పాకిస్తాన్ లో క్రికెట్ ఆట మారదన్నాడు. ప్రధానంగా క్రికెట్ నిర్మాణంలో, ప్రాధాన్యతలు మారాలని సూచించాడు.
శాఖాపరమైన క్రికెట్ ను నిలిపి వేయాలంటూ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రీడలలో వారి పాత్ర పాకిస్తాన్ క్రికెట్ కు లేదా మరే ఇతర క్రమశిక్షణకు మేలు చేసినట్లు కనిపించడం లేదని ఆరోపించాడు.
ఇటీవల ప్రధాని గా దిగి పోయాడు ఇమ్రాన్ ఖాన్ . కొత్త సర్కార్ కొలువు తీరింది. పీసీబీకి ఏరికోరి రమీజ్ రజాను తీసుకు వచ్చాడు. ఆయన మార్పులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేశాడు.
అంతలోనే ఖాన్ తప్పు కోవడంతో రజా సైతం రిజైన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ తరుణంలో మిస్బా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఏది ముఖ్యం ఏది అవసరమో గుర్తించే స్థాయికి చేరుకోవాలి క్రికెట్ బోర్డు. క్రికెట్ , ఇతర క్రీడలలో విభాగాలు లేదా సంస్థల పాత్ర లేకుండా ఇప్పుడు మూడు సంవత్సరాలు పూర్తయింది.
ఇప్పటి దాకా ఏం సాధించామో తెలియడం లేదన్నారు విస్బా ఉల్ హక్(Misbah Ul Haq). కేవలం క్రికెట్ కోసమే డబ్బులు ఖర్చు చేసిన విభాగాలు, సంస్థలు ఇప్పుడు ఆ డబ్బును వేరే చోట ఖర్చు చేస్తున్నాయని మిస్బా వాపోయాడు.
దేశీవాళి క్రికెట్లో ప్రాంతీయ సంఘం జట్లను ఏర్పాటు చేశారు. అది పరిపాలనా పరమైన సమస్యలకు దారి తీసిందన్నాడు విస్బా.
Also Read : తిప్పేసిన కుల్దీప్ యాదవ్