Chandrababu Naidu : ఖైదీల ఆవేదన బాబుకు నివేదన
రాజమండ్రి జైలులో సిట్యూయేషన్
Chandrababu Naidu : రాజమండ్రి – ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసులో ఏపీ సీఐడీ టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కీలక నిందితుడిగా పేర్కొంది. ఏసీబీ కోర్టులో బాబును ప్రవేశ పెట్టింది. కోర్టు జడ్జి బీఎస్వీ హిమ బిందు చంద్రబాబు నాయుడుకు 14 రోజుల రిమాండ్ విధించింది.
Chandrababu Naidu Meet Jail Victims
దీంతో భారీ భద్రత మధ్య బాబును రాజమండ్రి కేంద్ర కార్మాగారానికి తరలించారు. అక్కడ ప్రత్యేక గదిని కేటాయించారు. చంద్రబాబు నాయుడుకు(Chandrababu Naidu) జైలు అధికారులు ఖైదీ నెంబర్ ను కేటాయించారు. ఈ సందర్భంగా వివిధ కేసులలో జైలు పాలైన ఖైదీలు బాబును కలిసేందుకు ప్రయత్నం చేశారు.
తమ ఆవేదనను ఆయనతో పంచుకోవాలని అనుకుంటున్నారు. కారణం ఏమిటంటే క్షమాభిక్ష పెట్టాలంటే రాష్ట్ర సీఎం చేతిలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఖైదీలకు నాలుగసార్లు క్షమా భిక్షను ప్రసాదించారు.
కానీ ఆయన తర్వాత పవర్ లోకి వచ్చిన వైసీపీ చీఫ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేవలం ఒకే ఒక్కసారి క్షమా భిక్ష కు ఓకే చేశారని దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు ఖైదీలు.
Also Read : C Ashwini Dutt : అరెస్ట్ దారుణం కుట్ర నిజం