Priyam Garg : వారెవ్వా ప్రియమ్ గార్గ్ అదుర్స్
26 బంతులు 46 పరుగులు
Priyam Garg : ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 3 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి దాకా ఉత్కంఠ భరితంగా సాగింది గేమ్. నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగింది.
చివరకు టిమ్ డేవిడ్ రనౌట్ కావడంతో ముంబై పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ లో రాంచీ కుర్రాడు రాహుల్
త్రిపాఠి దంచి కొట్టాడు.
కేవలం 44 బంతులు మాత్రమే ఆడిన త్రిపాఠి 76 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇందులో 9 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక త్రిపాఠితో
పాటు మరో ఆటగాడు దుమ్ము రేపాడు. ప్రియమ్ గార్గ్(Priyam Garg) చెలరేగాడు.
ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 26 బంతులు ఎదుర్కొన్న గార్గ్ 42 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ సైతం సత్తా చాటాడు.
22 బంతులు ఎదుర్కొన్న పూరన్ 38 రన్స్ చేశాడు. ఇందులో 2 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక ప్రియమ్ గార్గ్ విషయానికి వస్తే 30 నవంబర్
2000లో పుట్టాడు.
వయస్సు 21 ఏళ్లు. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ స్వస్థలం. కుడి చేతి బ్యాటర్. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ కూడా. జట్టులో టాప్
ఆర్డర్ బ్యాటర్ గా ఇప్పటికే పేరొందాడు. 2018 నుంచి ఉత్తర ప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
2020 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఐపీఎల్ లో ఆడుతున్నాడు ప్రియమ్ గార్గ్. 2018లో త్రిపురతో జరిగిన మ్యాచ్ లో
తొలి డబుల్ సెంచరీ సాధించాడు ప్రియమ్ గార్గ్(Priyam Garg). హజరే ట్రోఫీలో ఆరు మ్యాచ్ లు ఆడి 287 పరుగులు చేశాడు
2020లో అండర్ -19 క్రికెట్ వరల్డ్ కప్ కోసం భారత జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు ప్రియమ్ గార్గ్. బంగ్లాదేశ్ తో ఓడి పోయినా భారత జట్టును ఫైనల్ కు తీసుకు వెళ్లాడు.
Also Read : వణుకు పుట్టించిన టిమ్ డేవిడ్