Priyank Kharge Comment : సన్మానాలు వద్దు పుస్తకాలు ముద్దు
ఆదర్శ ప్రాయంగా నిలిచిన మంత్రి ప్రియాంక్ ఖర్గే
Priyank Kharge Comment : ఎవరీ ప్రియాంక్ ఖర్గే అనుకుంటున్నారా. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తనయుడు. ప్రస్తుతం ఆయన చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. తాజాగా కర్ణాటకలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్రియాంక్ ఖర్గే కూడా గెలుపొందారు. ఆయన కేబినెట్ లో కీలక మంత్రి పదవి చేపట్టారు. ఆ వెంటనే అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ఇతర ప్రజా ప్రతినిధులు, సామాన్యులకు , నియోజకవర్గ ప్రజలకు బహిరంగంగా ఓ అప్పీలు చేశారు. అదేమిటంటే విలువైన కాలాన్ని వృధా చేయకండి. నాకోసం కేటాయించే సమయాన్ని ప్రజలకు సేవ చేసేందుకు వినియోగించాలని సూచించారు.
ఆపై తాను సన్మానాలు చేసుకోనని, బోకేలు, శాలువాలు తీసుకు రావద్దని ఏదైనా పని మీద ఉండి రావాల్సి వస్తే దయచేసి మంచి పుస్తకాలను తీసుకు రావాలని కోరారు. ప్రస్తుతం ప్రియాంక్ ఖర్గే చేసిన ఈ ప్రకటన అధికార పార్టీలోనే కాదు ప్రతిపక్ష పార్టీలను సైతం విస్తు పోయేలా చేసింది. వార్డు మెంబర్ గెలిస్తే చాలు, చిన్న పదవి దక్కితే పొద్దస్తమానం ప్రచారం చేసుకునే ప్రబుద్దులు ఉన్న ఈ తరుణంలో ప్రియాంక్ ఖర్గే(Priyank Kharge) తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మందిని ప్రభావితం చేసింది. మంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఔత్సాహికులు, పుస్తక ప్రియులు, వివిధ రంగాలలో ఉన్న వారు, మేధావులు, జాబ్ చేస్తున్న వారంతా తమకు తోచిన రీతిలో పుస్తకాలను పంపడం మొదలు పెట్టారు. ప్రస్తుతం వాటిని సేకరించే పనిలో పడ్డారు ప్రియాంక్ ఖర్గే.
ఆయన పిలుపునకు ఎందరో స్పందించారు. మంత్రిని అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ప్రియాంక్ ఖర్గే(Priyank Kharge) సామాజిక మాధ్యమాల ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వచ్చిన అరుదైన పుస్తకాలను గురించి తెలియ చేశారు. వీటిని రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలోని గ్రంథాలయాలకు అందజేస్తానని స్పష్టం చేశారు. ఎందుకంటే దేశానికి కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి. చదువు లేక పోతే భవిష్యత్తు చీకటి అవుతుందని పేర్కొన్నారు. విద్యతో వికాసం కలుగుతుందని దాని ద్వారా విజయం చేకూరుతుందని నమ్మానని అందుకే సహృదయులు ఎవరైనా సరే పుస్తకాలను మాత్రమే తనకు గిఫ్ట్ గా ఇవ్వాలని విన్నవించారు. వీటిని విద్యార్థులు, నిరుద్యోగులు ఉపయోగించు కోవాలని ..పుస్తకాలే మనిషికి తరగని ఆభరణాలు అని స్పష్టం చేశారు ప్రియాంక్ ఖర్గే. ప్రస్తుతం ఆయన చేసిన పని చిన్నదే కావచ్చు. కానీ తీసుకున్న నిర్ణయం మాత్రం సమాజానికి మేలు చేస్తుందని చెప్పడం సందేహం లేదు. హ్యాట్స్ ఆఫ్ యూ సర్..
Also Read : Tech Mahindra CEO : ఏఐ సిఇఓకు మహీంద్రా సిఇఓ సవాల్