Priyank Kharge : ఆ రెండు పార్టీల ముఖ్యనేతలు ఆరు మాసాల్లో జైలుకే
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏడు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి...
Priyank Kharge : బీజేపీ పాలనలో అక్రమాలపై విచారణలు వివిధ దశల్లో ఉన్నాయని ఐటీబీటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే(Priyank Kharge) కొత్తబాంబు పేల్చారు. బెంగళూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మధ్యంతర నివేదికలపై పరిశీలన జరుపుతున్నామని అన్నారు. వీటి ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. మరో ఆరు నెలల్లో బీజేపీ, జేడీఎస్‌కు చెందిన సగంమంది ముఖ్యనేతలు జైళ్లలో ఉంటారని, మిగిలిన సగంమంది బెయిల్‌పై ఉంటారని వ్యాఖ్యానించారు. గవర్నర్ ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర సాగుతోందని ఆరోపించారు. ఎవరో ఫిర్యాదు చేస్తే గవర్నర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారని తెలిపారు. మాజీ మంత్రి మురుగేశ్ నిరాణిపై ఫిర్యాదు చేస్తే గవర్నర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గవర్నర్‌కు ఎక్కడి నుంచి సూచనలు వస్తున్నాయన్నారు. కొన్ని రాష్ట్రాల గవర్నర్లు హోదాకు తగినట్టు వ్యవహరించడం లేదని, కోర్టులు మందలించే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
Priyank Kharge Comment
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏడు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. కాలిఫోర్నియాలో జరిగిన ప్రతిష్టాత్మక ఎయిర్‌పోర్ట్, ఫుడ్, బెవరేజ్‌తోపాటు హాస్పిటాలిటీ కాన్ఫరెన్స్ తదితర విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. బీఐఏఎల్(BIAL) శనివారం ప్రకటించిన సమాచారం మేరకు ఎయిర్‌పోర్ట్‌లో ఫుడ్, బెవరేజ్, హాస్పిటాలిటీ విభాగంలో నాణ్యత, గుణాత్మకతకు అవార్డులు వచ్చాయి. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-2లో 080 డొమెస్టిక్ లాంజ్ ప్రారంభమైందని, ఏడాదిలోనే ఉత్తమ అవార్డు దక్కిందని బీఐఏఎల్ ప్రకటించింది.
రాష్ట్ర సంస్కృతి, పరంపర ప్రతిబింబించేలా రూపొందించడంతో ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతి ఇస్తోందన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో తొలి మిట్టి కెఫెలను ప్రారంభించామని, ఇది దివ్యాంగులైన ప్రయాణికులకు ప్రత్యేక ప్రయోజనకారి అవుతోందన్నారు. ఇందుకుగాను మానవీయ ప్రశస్తి దక్కిందన్నారు. ఈ మేరకు బీఐఏఎల్ చీఫ్ కెన్నత్ గుల్డ్‌బెర్గ్ మాట్లాడుతూ ఫుడ్, బెవరేజ్ అవార్డులో ఉత్తమ పురస్కారం దక్కిన తొలి భారతీయ విమానాశ్రయమం అన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఏటా 25 మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. స్పెషల్‌థీమ్‌తో కేఐఏ టెర్మినల్-2 ప్రారంభమయ్యాక అత్యధిక పురస్కారాలు దక్కిన దేశంలోనే అతిపెద్ద మూడో ఎయిర్‌పోర్ట్‌గా నిలిచిందన్నారు.
Also Read : Tungabhadra Dam : 69 ఏళ్లలో మొదటిసారి కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేట్