Priyanka Chaturvedi : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ ను తొలగించండి
శివసేన ఎంపీ చతుర్వేది డిమాండ్
Priyanka Chaturvedi : డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ , బారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని మహిళా రెజ్లర్లు ఆందోళన బాట పట్టారు. దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. రెజ్లర్లకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. కేంద్రం రంగంలోకి దిగింది.
సాక్షాత్తు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చర్చలు జరిపినా ఫలితం లేక పోయింది. ఎట్టి పరిస్థితుల్లో తాము బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను తొలగించేంత దాకా ఆందోళన నిలిపే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు మహిళా రెజ్లర్లు. ఇప్పటికే ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ సందర్శించారు.
మహిళా రెజర్లతో మాట్లాడారు. వారు చేసిన ఆరోపణలపై నోటీసులు జారీ చేశారు. వెంటనే సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఓ వైపు చలి పెడుతున్నా మహిళా రెజ్లర్లు తమకు న్యాయం చేయాలని కోరుతున్నా ఇప్పటి వరకు మహిళా నాయకురాళ్లు, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, నిర్మలా సీతారామన్ ఎందుకు నోరు మెదపడం లేదంటూ నిప్పులు చెరిగారు శివసేన బాల్ ఠాక్రే పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది(Priyanka Chaturvedi) .
తక్షణమే డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలని, పదవి నుంచి తొలగించాలని, ఆయనతో పాటు కోచ్ లపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం రోజు కూడా మహిళా రెజ్లర్ల దీక్ష కొనసాగుతోంది.
Also Read : సింగ్ ను సాగనంపేంత దాకా సమరమే