Priyanka Chopra : మ‌లాలాకు ప్రియాంక చోప్రా మ‌ద్ద‌తు

హ‌స‌న్ మిన్హాజ్ ఎగ‌తాళిపై ఆగ్ర‌హం

Priyanka Chopra : హాస్య న‌టుడు హ‌స‌న్ మిన్హాజ్ ప్ర‌ముఖ మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త మ‌లాలాపై ఎగ‌తాళి చేయ‌డం క‌ల‌కలం రేపింది. ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌లాల‌కు మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఈ త‌రుణంలో సోష‌ల్ మీడియాలో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి. దీంతో తాను అలా ఎగ‌తాళి చేయ‌డం త‌ప్పేనంటూ పేర్కొన్నారు హ‌స‌న్ మిన్హాజ్.

ఇదిలా ఉండ‌గా మ‌లాలాకు సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా(Priyanka Chopra). ఆమె ప‌లు అంతర్జాతీయ సంస్థ‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ప‌ని చేస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో యునెస్కో త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా పిల్ల‌ల‌కు పౌష్టికాహారం అందించాల‌ని, మ‌హిళ‌ల హ‌క్కుల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తున్నారు చోప్రా.

ప్ర‌స్తుతం మ‌లాల‌కు ఆమె మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. ప్ర‌పంచం ఎంత‌గా మారినా పురుషుల భావ‌జాలంలో ఎలాంటి మార్పు రాలేద‌ని ఇది పూర్తిగా ప్ర‌తి ఒక్క‌రు నిర‌సించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు ప్రియాంక చోప్రా. హాస్యం వేరు ఎగ‌తాళి చేయ‌డం వేరు అన్న‌ది ముందుకు హ‌స‌న్ మిన్హాజ్ తెలుసు కోవాల‌ని సూచించారు.

ఇదిలా ఉండ‌గా ఇన్ స్టా గ్రామ్ లో నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత మ‌లాలా గురించి నేను జోక్ చేశాను. ఆమె ఇన్ స్టా లో న‌న్ను అనుస‌రిస్తుంద‌ని నేను ఆమెను తిరిగి అనుస‌రించ‌నని చెప్పానంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ప్రియాంక చోప్రా హ‌స‌న్ మిన్హాజ్ ఇన్ స్టా ప్రొఫైల్ స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది.

Also Read : విశ్వ‌నాథ్ కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

Leave A Reply

Your Email Id will not be published!