Priyanka Gandhi : మోదీ ప్రభుత్వం జనం పాలిట శాపం
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ
Priyanka Gandhi : ప్రజల చెవుల్లో పూలు పెట్టిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. మోదీ సర్కార్ ఇన్నేళ్లుగా చేసింది ఏమీ లేదన్నారు. కేవలం పన్నులు పెంచడం, వచ్చిన డబ్బులను దుర్వినియోగం చేయడం, అక్రమార్కులకు, ఆర్థిక నేరస్థులకు అండగా నిలవడం తప్ప చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు ప్రియాంక గాంధీ.
Priyanka Gandhi Comments on PM Modi
ప్రజలు చెల్లించిన జీఎస్టీ సొమ్మంతా కేంద్రానికి చేరుతుందన్నారు. పెట్రోల్, డీజీల్ ధరలను కేంద్రమే నిర్ణయిస్తుందని అన్నారు. చివరకు ఎల్పీజీ ధరల నియంత్రణ కూడా మోదీ చేతిలోనే ఉంటుందని ఇప్పటి వరకు ఎందుకు ధరలను అదుపు చేయలేక పోయారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
తమ ప్రభుత్వ హయాంలో రూ. 60 ఉన్న పెట్రోల్ ధర ఇవాళ రూ. 110 కి చేరుకుందన్నారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi ). గ్యాస్ సిలిండర్ ధర రూ. 400 ఉంటే ఇవాళ అది రూ. 1200 కు పెరిగిందని దీనికి మోదీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
ఇవాళ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతోందని కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు ప్రియాంక గాంధీ.
Also Read : Prashant Kishor : గులాబీ గెలుపుపై పీకే ఫోకస్