BCCI : సిరాజ్ కు ప్ర‌మోష‌న్ ర‌హానేకు డిమోష‌న్

వార్షిక కాంట్రాక్ట్ ల జాబితా ప్ర‌క‌టించిన బీసీసీఐ

BCCI : భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి కొత్త‌గా వార్షిక కాంట్రాక్ట్ జాబితాను ప్ర‌క‌టించింది. హైద‌రాబాదీ స్టార్ పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ కు ప‌దోన్న‌తి ద‌క్క‌గా భార‌త జ‌ట్టుకు ఎన‌లేని విజ‌యాలు సాధించి పెట్టిన అజింక్యా రహానేకు డిమోష‌న్ ల‌భించ‌డం విశేషం.

తాజాగా వార్షిక కాంట్రాక్ట్ జాబితా ప‌రంగా చూస్తే – ఎ – ప్ల‌స్, బి – ప్ల‌స్ – సి – ప్ల‌స్ కేట‌గిరీలోను వెల్ల‌డించింది. భారత జ‌ట్టు స్కిప్ప‌ర్ రోహిత్ శ‌ర్మ‌, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, జ‌స్ ప్రీత్ బుమ్రా -ఎ- గ్రేడ్ లో కొన‌సాగ‌నున్నారు.

వీరికి బీసీసీఐ ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లిస్తుంది. ఇప్ప‌టి దాకా ఇదే గ్రేడ్ లో కొన‌సాగుతున్న టెస్ట్ స్పెష‌లిస్ట్ ప్లేయ‌ర్లు అజింక్యా ర‌హానే, ఛ‌తేశ్వ‌ర్ పుజారా , ఇషాంత్ శ‌ర్మ‌లకు షాక్ ఇచ్చింది బిసీసీఐ.

వీరి స్థాయిని త‌గ్గిస్తూ -బి- గ్రేడ్ లో కి మార్చింది. బి – గ్రేడ్ జాబితాలోని ఆట‌గాళ్ల‌కు ఏడాదికి రూ. 3 కోట్లు చెల్లిస్తుంది బీసీసీఐ.(BCCI ) ఈ ముగ్గురు స్టార్ క్రికెట‌ర్లు ఇటీవ‌ల పేల‌వ‌మైన ఆట తీరుతో జ‌ట్టులో స్థానం కోల్పోయారు.

ఇక వ‌రుస గాయాల‌తో ఇబ్బంది ప‌డుతున్న హార్దిక్ పాండ్యా, వ‌న్డేల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన శిఖ‌ర్ ధావ‌న్ ల‌ను కూడా – ఎ – నుంచి త‌ప్పించి సి – గ్రేడ్ కు మార్చేసింది బీసీసీఐ. ఇక సి – గ్రేడ్ జాబితాలోని ప్లేయ‌ర్ల‌కు బీసీసీఐ రూ. కోటి ఇస్తుంది.

ఇక ఎ – గ్రేడ్ లో అశ్విన్ , జ‌డేజా, పంత్ , రాహుల్, ష‌మీ ఉన్నారు. వీరికి రూ. 5 కోట్లు చెల్లిస్తుంది. సాహా, మ‌యాంక్ లు బి నుంచి సికి మార్చేసింది. ఇప్ప‌టి దాకా సి – గ్రేడ్ లో ఉన్న సిరాజ్ ను బి – గ్రేడ్ లోకి తీసుకుంది. మొత్తం 27 మంది ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసింది.

Also Read : విభేదాలు అబ‌ద్దం కోహ్లీ అద్బుతం

Leave A Reply

Your Email Id will not be published!