#Farmer : బీమాతో రైతు కుటుంబాలకు ధీమా

Farmer : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతన్నలు అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. నీళ్లు లేక, కరెంటు రాక, ప్రకృతి సహకరించక, రైతులు పిట్టల్లా రాలిపోయారు. గ‌త ప్ర‌భుత్వాలు, పార్టీలు మొసలి కన్నీళ్లు కారుస్తూ, ఉప దంపుడు మాటలు రైతులను క‌న్నీళ్లు పెట్టించాయి.

Farmer : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతన్నలు అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. నీళ్లు లేక, కరెంటు రాక, ప్రకృతి సహకరించక, రైతులు పిట్టల్లా రాలిపోయారు. గ‌త ప్ర‌భుత్వాలు, పార్టీలు మొసలి కన్నీళ్లు కారుస్తూ, ఉప దంపుడు మాటలు రైతులను క‌న్నీళ్లు పెట్టించాయి. ఆత్మ‌హ‌త్య‌ల దిశ‌గా ప్రేరేపించాయి. ఆ క్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం రూపుదిద్దుకుని 10 ఏళ్లు విజ‌య‌వంతంగా పోరాటం సాగి ఎట్ట‌కేల‌కు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సాదించ‌గలిగారు ప్ర‌జ‌లు

ఈ క్ర‌మంలో ఏర్పాటైన‌ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ప్రధాన ఎజెండా ప్రకటించింది. రైతుల కోసం రుణమాఫీ, రైతుబంధు, వ్యవసాయానికి నిరంతరం ఉచిత కరెంటు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తో పాటు, రైతు బీమా తో రైతులందరికీ ఆర్థిక భరోసా కల్పించే పథకాన్ని రూపొందించారు.అన్నదాతకు రైతు బీమా పథకం(Farmer) అండగా నిలుస్తుంది. అనుకోని ప్రమాదం జరిగినప్పుడు బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటుంది. భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రం లో ఎవరూ చేయని విధంగా రైతులందరికీ ఐదు లక్షల జీవిత బీమా సౌకర్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా ఎంత వ్యయం అయినా సరే ప్రభుత్వమే భరిస్తుంది. విశ్వాసనీయత విస్తృత యంత్రాంగం కలిగిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయినా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ బీమా పథకం ఆగస్టు14, 2018 రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రైతు ఏ కారణం తో మరణించాడనే విషయంతో సంబంధం లేకుండా ఆయన ప్రతిపాదించిన నామినీకి పది రోజుల్లోగా 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా చెల్లించే విధంగా ఈ పథకం రూపొందించారు.

తెలంగాణలో చిన్న,సన్నకారు రైతులు 93 శాతం ఉన్నారు. ఒక్క ఎకరంలోపు ఉన్నవారు దాదాపు 18 లక్షల మంది ఉన్నారని అంచనా. వారికి భూమి తప్ప మరో జీవనాధారం లేదు. ఏదైనా పరిస్థితుల్లో రైతు మరణిస్తే ఆ కుటుంబం ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడుతుందని ఆ కుటుంబాలకు ఆర్థికపరంగా అండగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం వేసిన మరో ముందడుగు” రైతు బీమా(Farmer).”. ఇన్ని లక్షల మంది సభ్యులుగా గ్రూప్ ఇన్సూరెన్స్ చేయడం, ఒక్కొక్కరికి ఐదు లక్షల బీమా చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. రైతులకు జీవిత బీమా పథకం ఖచ్చితంగా ఓ సరికొత్త రికార్డు.

రాష్ట్ర ప్రణాళిక బోర్డు విడుదల చేసిన స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం 2018-19 లో 31.25 లక్షల మంది రైతులు బీమా పథకం కింద నమోదు చేయబడ్డారు. వీరి ప్రీమియం కోసం చెల్లించిన మొత్తము710.58 కోట్లు, 2019-20 లో1065.37 కోట్లు వ్యయంతో సుమారు 30.81 లక్షల మంది రైతులు ఈ పథకం కింద చేరారు.2020-21 లో 32.73 లక్షల మంది రైతులకు1173.54కోట్లు బీమా ప్రీమియం ప్రభుత్వం చెల్లించింది.

2018 ఆగస్టులో ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 40,243 రైతు కుటుంబాలకు 2012.15 కోట్ల రూపాయల బీమా సహాయం లభించింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలలో 51% బీసీలు, ఎస్సీలు 19 శాతం, ఎస్టీలు 14 శాతం ఉన్నారు. 49-59 సంవత్సరాల మధ్య వయసుగల రైతుల(Farmer) కుటుంబాలు ఎక్కువ ప్రయోజనం పొందాయి . ఈ పథకం కింద చేరిన మొత్తం రైతుల సంఖ్య లో 4.4 లక్షల రైతులతో నల్గొండ అగ్రస్థానంలో ఉంది. తర్వాత సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఖమ్మం. రైతు బీమా ద్వారా లబ్ధి పొందిన జిల్లాలలో కూడా నల్గొండ (2600), అగ్రస్థానంలో ఉంది. తర్వాత సంగారెడ్డి (2229),కామారెడ్డి (1687), ఖమ్మం (1661), రంగారెడ్డి (1655),మొదలైనవి ఉన్నాయి

కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఈ బీమా పరిహారం ఆర్థికంగా మనోధైర్యాన్ని నింపింది, వారి జీవితానికి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన వారికి ఇబ్బందులు లేకుండా చేస్తుంది. ఎదిగిన ఆడపిల్ల పెళ్లిళ్లకు, పిల్లల చదువులకు, ఏదైనా ఒక ఉపాధి కోసం ఈ డబ్బులు ఉపయోగపడుతున్నాయి. భూమిని నమ్ముకునే బ్రతికే రైతన్నలు రైతు బీమా తో ధీమాగా సమాజంలో నిలదొక్కు కుంటున్నారు

No comment allowed please