Psycho Woman: ప్రియుడి కోసం తల్లి, అక్కను దారుణంగా చంపిన సైకో యువతి !
ప్రియుడి కోసం తల్లి, అక్కను దారుణంగా చంపిన సైకో యువతి !
Psycho Woman : ప్రియుడి మోజులో పడి కొందరు తమ సొంత వారినే కడతేర్చుతున్నారు. తల్లి, తండ్రి, అక్క, చెల్లి.. అన్నా, తమ్ముడు అనే తేడా లేకుండా హతమార్చుతున్నారు. ఇటీవల అలాంటిదే హైదరాబాద్(Hyderabad) లోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, సోదరి మృతి చెందారు. ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ… చివరికి అసలు నిజం బయటకొచ్చింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు అన్ని విషయాలను బయటపెట్టారు. తన ప్రేమకు అడ్డు వస్తున్నారని.. ఓ కూతురే… తన ప్రియుడితో కలిసి తల్లి, అక్కను హతమార్చినట్లు తెలుస్తోంది. ఒక పూర్తి వివరాల్లోకి వెళితే…
Psycho Woman…
నార్త్ లాలాగూడకు చెందిన వుడుగుల సుశీలకు జ్ఞానేశ్వరి, లక్ష్మి, ఉమా మహేశ్వరి ముగ్గురు ఆడపిల్లలు, శివ అనే ఒక మగ బిడ్డ ఉన్నారు. వీరంతా అవివాహితులే. అందులో పెద్ద కూతురు జ్ఞానేశ్వరికి మానసిక స్థితి సరిగా లేదు. ఇక ఉమా మహేశ్వరి లాల్ బజార్(Lal Bazar) లోని ఒక కాల్ సెంటర్‌లో జాబ్ చేస్తుంది. కుమారుడు శివ అమెరికాలో(America) ఉద్యోగం చేస్తున్నాడు. ఇక వీళ్ల తండ్రి రైల్వే ఉద్యోగి. అతడు కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. దీనితో ఆ ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద రెండో కుమార్తె లక్ష్మికి ఇచ్చారు. దీనితో లక్ష్మి లాలాగూడ వర్క్ షాప్‌లో ఉద్యోగం అక్కడే రైల్వే క్వార్టర్స్‌లో ఉంటోంది. ఇక తనతో పాటే తన సోదరి జ్ఞానేశ్వరి ఉంటోంది. అదే సమయంలో యూపీకి చెందిన అరవింద్ కుమార్ అనే యువకుడితో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. 2010 నుంచే లక్ష్మి, అరవింద్ సన్నిహితంగా మెలగసాగారు. అది లక్ష్మి తల్లి సుశీలకు నచ్చలేదు. దీనితో పలుమార్లు కుటుంబసభ్యులు హెచ్చరించారు.
కానీ లక్ష్మీ మాత్రం వారి మాటలు పెడచెవిన పెట్టింది. ఈ క్రమంలో సోదరి జ్ఞానశ్వరి మొత్తం సమాచారాన్ని తల్లికి చెబుతుందని తెలుసుకుంది. దీనితో తన సోదరిని అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. దీనికోసం పక్కా ప్లాన్ వేసింది. ప్రియుడు అరవింద్ తో కలిసి ఈ నెల 3వ తేదీన సోదరి జ్ఞానేశ్వరిని హతమార్చింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఒక మూటలో కట్టి సిమెంట్ కుండీలో పడేసి ఏం తెలియన్లు ఉండిపోయారు.
ఇక ఈ సంఘటన జరిగిన మూడు రోజులకే అంటే 6వ తేదీన జవహర్‌నగర్ లోని నివాసముంటున్న సుశీలను సైతం లక్ష్మీ ప్రియుడు అరవింద్ హతమార్చాడు. రాత్రి 7 గం.ల సమయంలో ఒంటరిగా ఉన్న సుశీల ఇంటికి వెళ్లి ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీనితో ఆమె కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. వెంటనే స్థానికులు వచ్చి జరిగిన విషయాన్ని మరో కూతురు ఉమా మహేశ్వరికి చెప్పారు. ఆమె సంఘటన స్థలానికి చేరుకుని తీవ్ర రక్తంతో పడి ఉన్న తల్లి చూసి షాక్ అయింది. కానీ సుశీల అప్పటికే మరణించడంతో… పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.
రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా చెక్ చేశారు. దాని బట్టి లక్ష్మి ప్రియుడు అరవిందే ఈ అఘాయిత్యానికి పాల్పడి… గోడదూకి పారిపోయినట్లు గుర్తించారు. అనంతరం తిన్నగా వెళ్లి లక్ష్మిని ప్రశ్నించారు. దీనితో అసలు విషయం బయటకొచ్చింది. తమ బంధానికి అడ్డువుస్తుందనే కోపంతో సోదరి జ్ఞానేశ్వరిని హతమార్చినట్లు ఆమె ఒప్పుకుంది. అనంతరం మృతదేహాన్ని బయటకు తీసి పోర్టుమార్ట్ కు పంపించారు. లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరారిలో ఉన్న అరవింద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read : Rajnath Singh: డీలిమిటేషన్ తో సీట్ల సంఖ్య మార్పుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి రాజ్‌నాథ్