Danish Siddiqui : ఈ ఏడాది పులిట్జర్ ప్రైజ్ కు సంబంధించి జర్నలిజం, పుస్తకాలు, నాటకం, సంగీతం విభాగాలలో అవార్డులు ప్రకటించారు. మరణాంతరం డానిష్ సిద్దిఖీకి (Danish Siddiqui)రెండోసారి పులిట్జర్ పురస్కారం లభించింది.
విజేతలలో భారతీయులు అద్నాన్ అబిది, సన్నా ఇర్షాద్ మట్టూ , అమిత్ డేవ్ , జర్నలిజంలో రాయిటర్స్ కు చెందిన దివంగత డానిష్ సిద్దిఖీ కి లభించింది.
గత ఏడాది ఆఫ్గన్ ప్రత్యేక దళాలు, తాలిబన్ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణను కవర్ చేస్తూ సిద్దిఖీ (Danish Siddiqui)మరణించాడు. ప్రజా సేవకు గాను వాషింగ్టన్ పోస్ట్ కు లభించింది.
బ్రేకింగ్ న్యూస్ రిపోర్టింగ్ విభాగంలో మియామి హెరాల్డ్ సిబ్బంది, పరిశోధనాత్మక రిపోర్టింగ్ కు గాను టంపా బే టైమ్స్ కు చెందిన కోరి జి. జాన్సన్ ,
రెబెక్కా వూలింగ్ టన్ , ఎలి ముర్రే కు ఇచ్చారు. వివరణాత్మక రిపోర్టింగ్ విభాగంలో క్వాంటా మ్యాగజైన్ సిబ్బందికి,
స్థానిక రిపోర్టింగ్ కు గాను మాడిసన్ హాప్ కిన్స్ , నేషనల్ రిపోర్టింగ్ కు సంబంధించి న్యూయార్క్ టైమ్స్ సిబ్బందికి లభించింది.
అంతర్జాతీయ రిపోర్టింగ్ కు గాను న్యూయార్క్ టైమ్స్ కు దక్కింది. ఫీచర్ రైటింగ్ లో జెన్నిఫర్ సీనియర్ , వ్యాఖ్యానంలో మెలిండా హెన్నెబెర్గర్ కు పులిట్జర్ అవార్డు లభించింది.
విమర్శ విభాగంలో సలామిషా టిల్లెట్ , సంపాదకీయ రచన లో హ్యూస్టన్ క్రానికల్ కు చెందిన లిసా ఫాల్కెన్ బర్గ్ ,
మైఖేల్ లిండెన్ బెర్గెర్ , జో హూలీ , లూయిస్ కరాస్కో కు పులిట్జర్ దక్కింది.
ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ , కామెంట్ విభాగంలో ఫహ్మిదా ఆజిమ్ , ఆంథోనీ డెల్ కల్ , జోష్ ఆడమ్స్ , వాల్డ్ హికీ ని ఎంపిక చేశారు.
బ్రేకింగ్ న్యూస్ ఫోటోగ్రఫీ విభాగంలో లాస్ ఏంజెల్స్ టైమ్స్ కు చెందిన మార్కస్ యామ్ కు లభించింది.
జోన్ చెర్రీ, ఫీచర్ ఫోటోగ్రఫీలో అద్నాన్ అబిది, సన్నా ఇర్షాద్ మట్టూ, అమిత్ డేవ్ , రాయిటర్స్ కు చెందిన దివంగత డానిష్ సిద్దిఖీని ఎంపిక చేసింది.
ఆడియో రిపోర్టింగ్ లో ఫ్యూచురో మీడియా, పీఆర్ఎక్స్ సిబ్బందికి దక్కింది. ఫిక్షన్ లో ది నెతన్యాహాస్ , నాటకం ప్యాట్ హామ్ , చరిత్ర విభాగంలో కవర్డ్ విత్ నైట్ , యాన్ అమెరికన్ హిస్టరీని ఎంపిక చేశారు. జీవిత చరిత్ర కింద ఛేజింగ్ మీ టు మై గ్రేవ్ కు లభించింది.
కవిత్వం విభాగంలో ఫ్రాంక్ , సాధారణ నాన్ ఫిక్షన్ కంద ఇన్విజిబుల్ చైల్డ్ , సంగీతం కింద రావెన్ చాకన్ రచించిన వాయిస్ లెస్ మాస్ ఎంపికైంది.
Also Read : ఆంజనేయ అభయ ప్రదాత