Sidhu : ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బకు పంజాబ్ లో పార్టీలన్నీ కోలుకోలేని షాక్ కు గురయ్యాయి. పాలనా పరంగా పవర్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ.
ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య ధోరణి,
హైకమాండ్ అనాలోచిత నిర్ణయాలు, బాధ్యతా రాహిత్యం చివరకు 18 సీట్లకు పరిమితం అయ్యేలా చేశాయి. ఇది ఊహించని పరిణామం.
దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే అడ్రస్ లేకుండా పోయిందనే చెప్పక తప్పదు.
2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ అసెంబ్లీ ఎన్నికలు తమకు రెఫరెండమ్ గా,
సెమీ ఫైనల్స్ మ్యాచ్ గా భావిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఆయన ఇప్పటికే సంచలన కామెంట్స్ చేశారు. మిగతా పార్టీలకు ఎన్నికలు రాజకీయాలు మాత్రమే కానీ
మాకు అవి ఓ ఛాలెంజ్ లాంటివని. బీజేపీలో ఉన్నంత స్పిరిట్ కాంగ్రెస్ లో కనిపించకుండా పోయింది.
కెప్టెన్ అమరీందర్ సింగ్ కు సిద్దూకు మధ్య పొసగక ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు.
ఆ తర్వాత అనూహ్యంగా పార్టీ దళిత సామాజిక వర్గానికి చెందిన చన్నీకి ఛాన్స్ ఇచ్చింది.
కానీ అది కూడా వర్కవుట్ కాలేదు. సీఎం రెండు చోట్లా ఓడిపోయాడు. సామాన్యులు అన్ని పార్టీల నేతలకు
కోలుకోలేని రీతిలో జలక్ ఇచ్చారు. తనకు కంచుకోటగా భావించిన మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పాటియాలలో ఓడి పోయాడు.
ఆయనతో పాటు శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ , పీసీసీ చీఫ్ సిద్దూ , మజిథియా ఇలా అంతా ఇంటిబాట పట్టారు.
ఈ మొత్తం పంజాబ్ ఎపిసోడ్ లో సిద్దూనే బాధ్యత వహించక తప్పదన్న విమర్శలు ఉన్నాయి.
పార్టీని ముందుండి నడిపించాల్సిన ఈ రథసారథి ఉన్నట్టుండి శల్య సారథ్యం వహించడం వల్లే పార్టీ కొంప కొల్లేరయిందన్న ఆరోపణలు ఉన్నాయి.
పంజాబ్ రాష్ట్రం కోసం పంజాబ్ ఫార్ములా తయారు చేశామని గొప్పలు చెప్పిన సిద్దూ, కాంగ్రెస్ పార్టీ మాటల్ని ఏ ఒక్కరు నమ్మలేదు.
సరికదా ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ప్రచారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీని అందలం ఎక్కించారు. ఇప్పటికైనా జనం మధ్యన ఉండే వారికి మాత్రమే విజయం వరిస్తుందని గ్రహంచాలి.