PBKS vs SRH IPL 2022 : మాలిక్ దెబ్బకు పంజాబ్ కింగ్స్ విలవిల
సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 152
PBKS vs SRH : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నట్టే దుమ్ము రేపాడు ఉమ్రాన్ మాలిక్. అతడిని రాబోయే టీ20 వరల్డ్ కప్ లోకి తీసుకుంటే బెటర్ అని సూచించాడు.
అతడు అలా అన్నాడో లేదో కానీ ఇవాళ ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో దుమ్ము రేపాడు. పదునైన బంతుల్ని సంధించాడు. అద్బుతమైన బౌలింగ్ తో సత్తా చాటాడు. 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చిన ఉమ్రాన్ మాలిక్ 4 వికెట్లు తీశాడు.
విచిత్రం ఏమిటంటే ఆఖరు ఓవరులో మూడు వికెట్లు తీసు ఒక్క రన్ ఇవ్వక పోవడం విశేషం. ఇదిలా ఉండగా ఉమ్రాన్ దెబ్బకు పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు మాత్రమే చేసింది. దుకాణం సర్దేసింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ (PBKS vs SRH)లో లివింగ్ స్టోన్ ఒక్కడే మెరిశాడు.
60 పరుగులు చేసి ఔటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో కెప్టెన్ విలియమ్సన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. భారీ షాట్స్ తో విరుచుకు పడిన షారుక్ ఖాన్ 26 పరుగులు చేసి నిరాశ పరిచాడు.
అతడిని భువీ దెబ్బ కొట్టాడు. ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది పంజాబ్ కింగ్స్ . మొదట్లోనే ఉమ్రాన్ మాలిక్ అద్భుత బంతికి జితేశ్ శర్మ 11 పరుగులకే చాప చుట్టేశాడు. సుచిత్ బౌలింగ్ లో బెయిర్ స్టో అవుట్ అయ్యాడు. రివ్యూకు వెళ్లినా ఫలితం లేక పోయింది.
Also Read : కోహ్లీ..సాధారణ ప్లేయర్ గా ఆడు