CSK vs PBKS IPL 2022 : పంజాబ్ విజ‌యం చెన్నై ప‌రాజ‌యం

54 ప‌రుగుల తేడాతో అద్భుత విజ‌యం

CSK vs PBKS IPL 2022  : దుబాయి వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 14వ సీజ‌న్ లో ఊహించని రీతిలో స‌త్తా చాటి ఏకంగా టైటిల్ ను ఎగ‌రేసుకు పోయిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ఇప్పుడు వ‌రుస ఓట‌ముల‌తో ప్ర‌యాణం చేస్తోంది.

ఇంకా అవ‌కాశాలు ఉన్న‌ప్ప‌టికీ ఇక నుంచి ప్ర‌తి మ్యాచ్ గెల‌వాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. సీఎస్కేకు సుదీర్ఘ కాలం పాటు నాయ‌కుడిగా ఉన్న మ‌హేంద్ర సింగ్ ధోనీ ఉన్న‌ట్టుండి రిచ్ లీగ్ ప్రారంభం కంటే ముందే త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

దీంతో ఆ ప్ర‌భావం జ‌ట్టుపై తీవ్రంగా పడింది. ఇక ర‌వీంద్ర జ‌డేజా త‌న వార‌సుడ‌ని ప్ర‌క‌టించినా జ‌ట్టు తీరులో ఎలాంటి మార్పు క‌నిపించ‌డం లేదు.

తాజాగా లీగ్ మ్యాచ్ లో భాగంగా మ‌యాంక్ అగ‌ర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ తో

త‌ల‌ప‌డిన చెన్నై సూప‌ర్ కింగ్స్ 54 ప‌రుగుల తేడాతో భారీ ఓట‌మిని చ‌వి చూసింది. వ‌రుస‌గా హ్యాట్రిక్ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది.

మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 180 ప‌రుగులు చేసింది.

లివింగ్ స్టోన్ 32 బంతులు ఆడి 5 ఫోర్లు 5 సిక్స‌ర్ల తో స‌త్తా చాటాడు. 60 ప‌రుగులు చేశాడు.

శిఖ‌ర్ ధావ‌న్ 33 ర‌న్స్ చేస్తే జితేశ్ శ‌ర్మ 26 ప‌రుగులు చేశాడు. ఇక చెన్నై బౌల‌ర్ల‌లో జోర్డాన్, ప్రిటోరియ‌ల‌స్ చెరో రెండు వికెట్లు తీశారు. 181 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ పంజాబ్ బౌల‌ర్ల ధాటికి చేతులెత్తేసింది.

18 ఓవ‌ర్ల‌లోనే 126 ప‌రుగుల‌కే ఆలౌటైంది. శివ‌మ్ దూబే 30 బంతులు ఆడి 6 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 57 ప‌రుగులు చేస్తే ధోనీ 23 ర‌న్స్ తో రాణించాడు.

ఊత‌ప్ప 13, రుతురాజ్ గైక్వాడ్ 1, మొయిన్ అలీ , జ‌డేజా, బ్రేవో డ‌కౌట్లు కాగా రాయుడు 13 ప‌రుగుల‌కే వెనుదిరిగారు.

Also Read : ఆసిస్ కు షాక్ పాక్ దే వ‌న్డే సీరీస్

Leave A Reply

Your Email Id will not be published!