IPL Auction 2022 : భారీ ధ‌ర ప‌లికిన ఓడియ‌న్..లివింగ్ స్టోన్

ఇయాన్ మోర్గాన్..స్టీవ్ స్మిత్ ..మిల్ల‌ర్ల‌కు షాక్

IPL Auction 2022  : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ – ఐపీఎల్ 2022 వేలం(IPL Auction 2022 )పాట రెండో రోజు ప్రారంభ‌మైంది. ప‌ది జ‌ట్ల ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. ఓడియ‌న్ స్మిత్, లివింగ్ స్టోన్ ల పంట పండింది ఇవాళ‌.

గ‌త ఐపీఎల్ లో టాప్ స్థాయిలో రాణించిన కేకేఆర్ కెప్టెన్ గా ఉన్న ఇయాన్ మోర్గాన్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది.

ఫ్రాంచైజీల‌కు సంబంధించిన ఏ జ‌ట్టు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు.

మోర్గాన్ తో పాటు స్టీవ్ స్మిత్ , ఉమేష్ యాద‌వ్ , ఇషాంత్ ష‌ర్మ‌, త‌దిత‌ర బిగ్ స్టార్ల‌ను ప‌ట్టించు కోక పోవ‌డం క్రీడాభిమానుల్ని విస్తు పోయేలా చేసింది.

లివింగ్ స్టోన్ ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 11. 5 కోట్ల‌కు కొనుగోలు చేసింది.

ఇక వెస్టిండీస్ కు చెందిన ఆల్ రౌండ‌ర్ ఓడియ‌న్ స్మిత్(IPL Auction 2022 )ను రూ. 6 కోట్ల‌కు తీసుకుంది. ఇక రెండో రోజు ప్రారంభ‌మైన వేలం పాట‌లో ఫ‌స్ట్ ప్లేయ‌ర్ ఐడెన్ మార్క్రామ్.

ఈ క్రికెట‌ర్ ను స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ సిఇఓ కావ్య మార‌న్ అత‌డిని రూ. 2.6 కోట్ల‌కు ద‌క్కించుకుంది.

ఇది ఒక ర‌కంగా రికార్డ్ బ్రేక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. మోర్గాన్ , మార్న‌స్ లాబూస్ చాగ్నే, ఆరోన్ ఫించ్ , త‌దిత‌ర ఆట‌గాళ్లు అమ్ముడు పోలేదు. అజింక్యా ర‌హానేను కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కోటి రూపాయ‌ల‌కు తీసుకుంది.

మొద‌టి రోజు 97 మంది ఆట‌గాళ్లు బ‌రిలో నిలిచారు. మొత్తం 590 ఆట‌గాళ్ల‌లో ఇప్ప‌టి దాకా ఇంకా కొన‌సాగుతూనే ఉంది వేలం పాట‌. అత్యధికంగా అమ్ముడు పోయిన వాళ్ల‌లో టాప్ లో ఇషాన్ కిష‌న్ ను ముంబై ఇండియ‌న్స్ రూ. 15.25 కోట్లకు తీసుకుంది.

దీప‌క్ చాహ‌ర్ ను రూ. 14 కోట్ల‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ ద‌క్కించు కోగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ అవేశ్ ఖాన్ ను రూ. 10 కోట్లకు తీసుకుంది.

Also Read : రూ. 15.25 కోట్ల ధ‌ర ప‌లికిన ఇషాన్ కిషాన్

Leave A Reply

Your Email Id will not be published!