Punjab Row Comment : పంజాబ్ బాద్ షా నువ్వా నేనా
ఆప్ సీఎం వర్సెస్ గవర్నర్
Punjab Row Comment : భారత రాజ్యాంగం పదే పదే చర్చకు వస్తోంది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ముందు చూపుతో రాసిన ఈ వేదం ఇప్పుడు ప్రతి ఒక్కరికి పాఠంగా మారింది.
ఇది పక్కన పెడితే దేశానికి మొదటి పౌరుడు రాష్ట్రపతి. ఇక రాష్ట్రానికి గవర్నర్. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత వీరిపైనే ఉంటుంది. కాదనలేని సత్యం.
చట్టం కావాలంటే ఇద్దరి ముద్రలు ఉండాల్సిందే. లేక పోతే అది చట్టం కాదు. దీంతో పవర్ మేకింగ్ పర్సన్స్ గా, కింగ్ పిన్ లుగా మారి పోయారు గవర్నర్లు.
వీరు రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. ఎప్పటికప్పుడు నివేదికలు అటు కేంద్రానికి కూడా ఇస్తుంటారు. ఇది పక్కన పెడితే నాటి ఇందిరా గాంధీ నుంచి నేటి
నరేంద్ర మోదీ దాకా గవర్నర్ల వ్యవస్థ ఆద్యంతమూ వివాదాస్పదంగా మారుతోంది.
ఒకప్పుడు ఉమ్మడి ఏపీగా ఉన్న కాంగ్రెస్ యేతర ప్రభుత్వమైన ఎన్టీఆర్ సర్కార్ ను ఒక్క సంతకంతో గవర్నర్ రాం లాల్ పడగొట్టారు. అది చర్చకు దారితీసింది.
ఆ తర్వాత టీడీపీ భారీ ఎత్తున విజయాన్ని సాధించి మరోసారి ప్రజాస్వామ్య జెండాను ఎగుర వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో
ఉదాహరణలు ఉన్నాయి.
ఇక మరోసారి కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ (ఎన్డీఏ) సర్కార్ ను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి వుంది. ఎందుకంటే దేశంలో
బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో గవర్నర్లు కర్ర పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
వీటిని పదే పదే ఎత్తి చూపుతూ వస్తున్నారు ఆయా రాష్ట్రాల సీఎంలు. ఇటీవల జార్ఖండ్ లో గవర్నర్ ఏకంగా సీఎం హేమంత్ సోరేన్ సభ్యత్వంపై అనర్హత వేటు వేశారు.
దీనిపై సవాల్ చేస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టి మరోసారి బలం నిరూపించుకున్నారు. ఇక మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ సర్కార్ కూలి పోవడంలో గవర్నర్ ఒకింత చేయి వేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇక పశ్చిమ బెంగాల్ లో నువ్వా నేనా అన్న రీతిలో సాగింది పోరాటం. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్ ఖర్ వర్సెస్ సీఎం మమతా బెనర్జీ మధ్య ఆరోపణలు కొనసాగాయి.
తమిళనాడులో గవర్నర్ ఆర్. ఎన్. రవి సీఎం ఎంకే స్టాలిన్ మధ్య పొసగడం లేదు. ఇక కేరళలో సీఎం పినరయి విజయన్ వర్సెస్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్
ఖాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది.
తెలంగాణలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సీఎం కేసీఆర్ ల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లింది.
ఇదే క్రమంలో ఢిల్లీలో ఆప్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు లెఫ్టినెంట్ గవర్నర్ నవీన్ కుమార్ సక్సేనాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.
తాజాగా మరో వివాదానికి కేరాఫ్ గా మారింది పంజాబ్ రాష్ట్రం(Punjab Row) . అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా
కోరినా గవర్నర్ పట్టించు కోవడం లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం భగవంత్ మాన్.
ప్రస్తుతం రాష్ట్రంలో బనర్వరీలాల్ పురోహిత్, మాన్ ల మధ్య ఆధిపత్య పోరుకు తెర లేపింది. రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ నామినేటెడ్ అయితే సీఎం ప్రజల పక్షాన ఎన్నుకున్న ఎమ్మెల్యేల ప్రతినిధి. ఇద్దరూ ముఖ్యమే.
కానీ రాజ్యాంగ పరంగా పవర్స్ విషయంలో ఇద్దరూ ఒక్కటే. ఇద్దరూ సంయమనంతో వ్యవహరించాలి. రాజకీయాలను పక్కన పెట్టాలి. రాగ ద్వేషాలకు అతీతంగా రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా పని చేయాల్సిన అవసరం ఉంది.
ఇకనైనా ఇగోలు పక్కన పెడితే సీఎంకు గవర్నర్ కు బెటర్.
Also Read : క్రికెట్ మ్యాచ్ కోసం ట్రాఫిక్ రూల్స్