Pushpa Song Effect : పుష్ప సాంగ్ ఎఫెక్ట్ ప్రిన్సిపాల్ స‌స్పెండ్

ఒడిశాలో చోటు చేసుకున్న ఘ‌ట‌న

Pushpa Song Effect : క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్, ర‌ష్మిక మందన్నా, స‌మంత న‌టించిన పుష్ప మూవీ దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇప్ప‌టికే ఆ మూవీకి సంబంధించిన డైలాగులు, సాంగ్స్ దుమ్ము రేపుతున్నాయి.

ఈ త‌రుణంలో పుష్ప మూవీకి సంబంధించి విద్యార్థులు డ్యాన్స్ చేసిన ఘ‌ట‌న ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. దాంతో దానికి బాధ్య‌త వ‌హిస్తూ ప్రిన్సిపాల్ ను స‌స్పెండ్ చేశారు(Pushpa Song Effect) .

విచార‌ణ జ‌రిపి విధి నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యం చేసిన మ‌రి కొంత మంది టీచ‌ర్ల‌పై కూడా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు జిల్లా ఉన్న‌తాధికారి ఒక‌రు తెలిపారు. విద్యార్థులు పుష్ప మూవీ పాట‌కు చేసిన డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

ఈ ఘ‌ట‌న ఒడిశాలో ని గంజాం జిల్లాలోని ఒక ఉన్న‌త పాఠ‌శాల లో చోటు చేసుకుంది. షెర‌గ‌డ బ్లాక్ లోని బారాముండ‌లి హైస్కూల్ లో స్మార్ట్ క్లాస్ రూమ్ లో ప‌లువురు 10 వ త‌ర‌గ‌తి విద్యార్థులు స‌మావేశం అయ్యారు.

ఉపాధ్యాయులు హైస్కూల్ స‌ర్టిఫికెట్ ప‌రీక్ష కోసం కొన్ని చిట్కాల‌ను అందించారు స్టూడెంట్స్ కు. దానిని అనుస‌రించి వారు గ‌దికి తాళం వేయ‌కుండా వెళ్లి పోయారు.

జిల్లా అధికారి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం గ‌దిలో ఉన్న కొంత మంది విద్యార్థులు త‌మ మొబైల్ ఫోన్ల‌లో టీవీని లింక్ చేసి ఉండ వ‌చ్చ‌ని అనుమానం వ్య‌క్తం చేశారు.

14 నుంచి 24 సెక‌న్ల నిడివి క‌లిగిన రెండు డాన్స్ వీడియోలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేశాయి(Pushpa Song Effect). శ్రీ‌వ‌ల్లి పాట కావ‌డం విశేషం. హెచ్ఎం సుజాద పాధికి కి షోకాజ్ నోటీసు అంద‌జేశారు. ఆమె స‌రిగా స్పందించ లేద‌ని బీడిఓ తెలిపారు.

 

Also Read : Ma Ma Mahesha : ‘మ మ మ‌హేషా’ సాంగ్ ప్రోమో మాస్

Leave A Reply

Your Email Id will not be published!