Dadasaheb Phalke Awards : ఫిల్మ్ ఆఫ్ ది ఇయ‌ర్ గా పుష్ప‌

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2022

Dadasaheb Phalke Awards : సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ల‌వ్లీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టించిన పుష్ప మూవీ దుమ్ము రేపింది. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది.

పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కింది. తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా 3 వేల థియేట‌ర్ల‌లో విడుద‌లైంది.

బ‌న్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ స‌క్సెస్ , క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టిన మూవీగా నిలిచి పోయింది.

ఇప్ప‌టి దాకా రూ. 370 కోట్ల‌కు పైగా కొల్ల‌గొట్టింద‌ని అంచ‌నా. రికార్డుల మోత మోగిస్తూ షేక్ చేస్తున్న పుష్ప మూవీ అరుదైన ఘ‌న‌త స్వంతం చేసుకుంది.

ప్ర‌తి ఏటా దాదా సాహెబ్ ఫాల్కే ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ అవార్డులు(Dadasaheb Phalke Awards) ప్ర‌క‌టిస్తారు.

ఈసారి ది రైజ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయ‌ర్ గా ప్ర‌క‌టించారు. ఇక ప్ర‌ముఖ క్రికెట‌ర్ క‌పిల్ దేవ్ సార‌థ్యంలో భార‌త జ‌ట్టు 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ తీసుకు వ‌చ్చింది. దానిపై 83 పేరుతో సినిమా తీశారు.

అందులో అద్భుతంగా న‌టించినందుకు గాను ర‌ణ వీర్ సింగ్ ఉత్త‌మ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డుల ప్ర‌ధానోత్స‌వం ముంబైలో జ‌రిగింది.

షేర్షా ఉత్త‌మ చిత్రంగా , కృతి స‌న‌న్ ఉత్త‌మ న‌టి, మ‌నోజ్ వాజ్ పేయి వెబ్ సీరీస్ ఉత్త‌మ న‌టుడు,.

ర‌వీనా టాండ‌న్ వెబ్ సీరీస్ లో ఉత్త‌మ న‌టిగా, టెలివిజ‌న్ సీరీస్ ఆఫ్ ది ఇయ‌ర్ గా అనుప‌మ అందుకున్నారు.

ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా కెన్ ఘోష్ , చిత్ర ప‌రిశ్ర‌మకు అత్యుత్త‌మ స‌హ‌కారం అందించినందుకు గాను ఆశా ప‌రేఖ్, ఉత్త‌మ స‌హాయ న‌టుడిగా స‌తీష్ కౌశిక్ ,

స‌హాయ పాత్ర‌లో ఉత్త‌మ న‌టిగా లారా ద‌త్తా, ప్ర‌తికూల పాత్ర‌లో ఉత్త‌మ న‌టుడిగా ఆయుష్ శ‌ర్మ అవార్డు అందుకున్నారు.

విమ‌ర్శ‌కుల ఉత్త‌మ చిత్రంగా స‌ర్దార్ ఉద్ద‌మ్ సింగ్ , ఉత్త‌మ న‌టుడిగా సిద్దార్థ్ మ‌ల్హోత్రా, క్రిటిక్స్ ఉత్త‌మ న‌టిగా కియారా అద్వానీ,

పీపుల్స్ ఛాయిస్ బెస్ట్ యాక్ట‌ర్ అభిమ‌న్యు ద‌స్సాని, పీపుల్స్ ఛాయిస్ ఉత్త‌మ న‌టి రాధికా మ‌ద‌న్ పుర‌స్కారాలు అందుకున్నారు.

బెస్ట్ డెబ్యూఅహ‌న్ శెట్టి, ఉత్త‌మ ఇంట‌ర్నేష‌న‌ల్ చ‌ల‌న చిత్రంగా మ‌రో రౌండ్, ఉత్త‌మ వెబ్ సీరీస్ గా కాండీ,

టెలివిజ‌న్ సీరీస్ లో ఉత్త‌మ న‌టుడిగా షహీర్ షేక్ , ఉత్త‌మ న‌టిగా శ్ర‌ద్ధా ఆర్యా, మోస్ట్ ప్రామిసింగ్ యాక్ట‌ర్ గా ధీరజ్ ధూప‌ర్ పుర‌స్కారాలు అందుకున్నారు.

ప్రామిసింగ్ న‌టిగా రూపాలీ గంగూలీ, ఉత్త‌మ షార్ట్ ఫిల్మ్ గా పౌలి, ఉత్త‌మ సింగ‌ర్ గా విశాల్ మిశ్రా, ఫిమేల్ సింగ‌ర్ గా క‌నికా క‌పూర్, ఉత్త‌మ ఛాయాగ్ర‌హ‌కుడిగా జ‌య‌కృష్ణ గుమ్మ‌డి పుర‌స్కారం అందుకున్నారు.

Also Read : హిజాబ్ వివాదం జైరా వాసిమ్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!