PV Sindhu : తెలుగు తేజం స్వర్ణ సింధూరం
కామన్వెల్త్ గేమ్స్ లో పీవీ సింధు
PV Sindhu : నిన్న తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బాక్సింగ్ లో సత్తా చాటింది. ఏకంగా బంగారు పతకాన్ని సాధించింది. తనకు ఎదురే లేదని చాటింది.
తాజాగా ఏపీకి చెందిన తెలుగు తేజం పీవీ సింధు(PV Sindhu) స్వర్ణ పతకాన్ని సాధించింది. భారత బ్యాడ్మింటన్ స్టార్ గా ఇప్పటికే పేరొందిన పూసర్ల వెంకట సింధు ఘన విజయాన్ని నమోదు చేసింది.
ప్రతిష్టాత్మకమైన క్రీడల్లో మరోసారి భారతీయ పతాకం రెప రెప లాడేలా చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో అద్బుత ప్రదర్శనతో పసిడిని గెలిచి రికార్డు సృష్టించింది.
తన కెరీర్ లో మరో పతకాన్ని చేర్చింది. బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్ వేదికగా సోమవారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. కెనడాకు చెందిన స్టార్ షట్లర్ మిచెల్లీ లీని పీవీ సింధు(PV Sindhu) కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఆట ఆరంభం నుంచే దూకుడు పెంచింది. 21-15, 21-13 తో వరుసగా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు ప్రత్యర్థికి. బలమైన షాట్లకు పెట్టింది పేరు పీవీ సింధు. వరుస సెట్లలో పై చేయి సాధించింది.
తనకు ఎదురే లేదని చాటి చెప్పింది ఈ ప్రపంచానికి. ఇదిలా ఉండగా సింధు మొత్తం కెరీర్ లో ఇదే మొదటి మెడల్ సాధించడం కామన్వెల్త్ గేమ్స్ లో. అంతకు ముందు 2014లో జరిగిన పోటీల్లో కాంస్య పతకానికే పరిమితమైంది.
2018లో జరిగిన క్రీడల్లో రజత పతకానికే పరిమితమైంది. తుది పోరులో మరో స్టార్ షెట్లర్ నైనా నెహ్వాల్ చేతిలో ఓడి పోయింది. కానీ ఇంత కాలం తనకు అందకుండా పోయిన బంగారు పతకాన్ని ఇవాళ సాధించింది.
Also Read : మహిళా జట్టుపై అజహరుద్దీన్ ఆగ్రహం