PV Sunil Kumar IPS : కావాలని జై భీంను పక్కన పెట్టారు
ఆంధ్రా డీజీపీ పీవీ సునీల్ కుమార్
PV Sunil Kumar IPS : ఆంధ్రా ఫైర్ సర్వీసెస్ డీజీపీ పీవీ సునీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా జాతీయ స్థాయిలో అవార్డులను ప్రకటించడంపై ఆయన స్పందించారు. ట్విట్టర్ వేదికగా శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించడం నేర్పే సినిమాలకు ఎప్పుడూ పురస్కారాలు దక్కవని పేర్కొన్నారు.
PV Sunil Kumar IPS Comments Viral
కాలు మీద కాలు వేసుకోవడం నేర్పే సినిమాను కావాలని పక్కన పెడతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమిళ సినిమా దర్శకుడు జ్ఞానవేల్ తీసిన జైభీం సినిమాకు ఎందుకు జాతీయ స్థాయిలో అవార్డు ఇవ్వలేదని ప్రశ్నించారు.
మిగతా సినిమాల గురించి కూడా ఆయన పోల్చారు. ప్రేమ, వయొలెన్స్ , నేరం, బూతు లాంటి అంశాలతో ఉండే మూవీస్ కు , మనుషుల్ని నిద్ర పుచ్చే లాంటి చిత్రాలకు ప్రయారిటీ ఇచ్చారంటూ వాపోయారు పీవీ సునీల్ కుమార్.
గత ఏడాది కూడా ఇలాగే జరిగిందని పేర్కొన్నారు. దళిత వాదం వైపు నిలబడిన , దళిత పౌరుషం, రోషం చూపించిన పలాస చిత్రానికి అవార్డు దక్కలేదని ఈ సందర్బంగా గుర్తు చేశారు. కలర్ ఫోటో ఒక పెసిమిస్టిక్ లాంటి చెత్త సినిమాకు పురస్కారం దక్కిందని మండిపడ్డారు.
ఉప్పెన కూడా దాని కంటే మించి ఉందని పేర్కొన్నారు పీవీ సునీల్ కుమార్(PV Sunil Kumar IPS). మన సమస్యల మీద, మన కళల మీద మనకి అనుకూలంగా మనం ఓటు వేసిన వాళ్లు ఎవరైనా జై భీం గురించి మాట్లాడుతున్నారా అని నిలదీశారు.
Also Read : Mynampally Hanumantha Rao : మైనంపల్లి బూతు పురాణం