Quinton De Kock : ఆకాశమే హద్దుగా విధ్వంసమే తోడుగా
క్వింటన్ డికాక్ విరోచిత ఇన్నింగ్స్
Quinton De Kock : ఐపీఎల్ 2022లో జరిగిన కీలక పోరులో పరుగుల వరద పారింది. ఇరు జట్లు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాయి. కానీ ఒకరిని మించి మరొకరు రెచ్చి పోయారు. దుమ్ము రేపారు. కళ్లు చెదిరే షాట్లతో ఆకట్టుకున్నారు.
ప్రధానంగా లక్నో సూపర్ జెయింట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సఫారీ స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్(Quinton De Kock) దంచి కొట్టాడు. ఫోర్లు సిక్సర్లతో రెచ్చి పోయాడు.
క్రికెట్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు డికాక్ తన విధ్వంసకరమైన ఆట తీరుతో. కేవలం 70 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఈ క్రికెటర్ ఏకంగా 140 రన్స్ చేసి నాటౌట్ గా మిగిలాడు.
ఓపెనింగ్ భాగస్వామ్యం కేఎల్ రాహుల్ తో కలిసి 210 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు 10 సిక్సర్లు ఉన్నాయి. కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. నిద్ర లేకుండా చేశాడు.
కేవలం ఫోర్లు, సిక్స్ లు కలిపి 100 రన్స్ వచ్చాయి. 17 డిసెంబర్ 1992లో పుట్టాడు. దేశీయ స్థాయిలో టైటాన్స్ , ఐపీఎల్ లో లక్నో తరపున ఆడుతున్నాడు. 2017 వార్షిక అవార్డులలో క్రికెట్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు.
మోస్ట్ పాపులర్ స్టార్ ప్లేయర్ గా పేరు పొందాడు. ఓపెనర్ గా రాణించాడు. అంతే కాదు వికెట్ కీపర్ కూడా. క్వింటన్ డికాక్(Quinton De Kock) 2012-13 సీజన్ లో హై వెల్డ్ లయన్స్ తరపున అరంగేట్రం చేశాడు.
ఇదే ఏడాది న్యూజిలాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ ల్లో ఎంటర్ అయ్యాడు. 2014లో దక్షిణాఫ్రికా జట్టు తరపున టెస్టు మ్యాచ్ ఆడాడు. వరుసగా మూడు వన్డే సెంచరీలు సాధించిన నాలుగో ఆటగాడిగా డికాక్ చరిత్ర సృష్టించాడు.
వన్డేలో అత్యంత వేగవంతమైన సెంచరీ కూడా ఇతడి పేరు మీదే ఉంది.
Also Read : ఐదోసారి 500 రన్స్ చేసిన రాహుల్