R Praggnanandhaa : వరల్డ్ ఛాంపియన్ ను ఓడించి టాటా స్టీల్ మాస్టర్స్ 2025 టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద

నిజానికి,ఆర్ ప్రజ్ఞానంద, డి గుకేష్ మధ్య ఆట ఉత్కంఠభరితంగా కొనసాగింది...

R Praggnanandhaa : ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్‌ను గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ఓడించి సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఈ క్రమంలో గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద టాటా స్టీల్ మాస్టర్స్ 2025 టైటిల్ గెల్చుకున్నాడు. టై-బ్రేకర్‌లో ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్‌ను ప్రజ్ఞానంద 2-1 తేడాతో ఓడించాడు. ఈ క్రమంలో 2006లో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత టాటాలో అత్యున్నత బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయుడిగా ప్రజ్ఞానంద(R Praggnanandhaa) అరుదైన ఘనతను దక్కించుకున్నాడు.

R Praggnanandhaa Won..

నిజానికి,ఆర్ ప్రజ్ఞానంద, డి గుకేష్ మధ్య ఆట ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఆ క్రమంలో 13వ, చివరి రౌండ్ పూర్తి చేసిన తర్వాత ఇద్దరూ కూడా 8.5 పాయింట్లతో ఆటను డ్రాగా ముగించారు. ఈ క్రమంలోనే ఇద్దరు యువ ఆటగాళ్ళు టై-బ్రేకర్ మ్యాచ్‌ ఆడటం ద్వారా విన్నర్ ఎవరో తేలిపోయింది. ఆదివారం రెండు గేమ్‌ల బ్లిట్జ్ టైబ్రేకర్‌లో గుకేష్ మొదటి గేమ్‌ను గెలుచుకున్నాడు. కిరీటాన్ని కైవసం చేసుకోవడానికి గుకేష్‌కు రెండో బ్లిట్జ్ టైబ్రేకర్‌లో ఒక డ్రా మాత్రమే అవసరం. అయితే ప్రజ్ఞానంద రెండు బ్లిట్జ్ గేమ్‌లను గెలిచి మళ్లీ తిరిగి వచ్చాడని చెప్పవచ్చు. ఈ క్రమంలో ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించి కీలక టైటిల్‌ను గెలుచుకున్నాడు.

ప్రారంభగేమ్‌లో ప్రజ్ఞానందా ఒక తప్పు చేసి, బెనోనిని రివర్స్ కలర్స్‌లో ఎదుర్కొన్నాడు. అందువల్ల ఆయన ఆ గేమ్‌ను కోల్పోయాడు. కానీ ఆ తర్వాత అతను రెండో గేమ్‌లో ట్రోంపోవ్‌స్కీ ఓపెనింగ్ ఉపయోగించి, చిట్టా గేమ్ ఆడతూ, గుకేష్ చేసిన ఒక తప్పిదాన్ని సద్వినియోగం చేసుకుని స్కోరు 1-1గా సమం చేసుకున్నాడు.ఆ తర్వాత టైబ్రేకర్ ఆట సడన్ డెత్ ఫార్మాట్‌లోకి వెళ్లింది. ఇందులో తెల్లటి పావుల ఆటగాడికి 2 నిమిషాల 30 సెకన్లు, నల్లటి పావుల ఆటగాడికి 3 నిమిషాలు సమయం ఇచ్చారు. ఈ ఉత్కంఠభరితమైన పోరాటంలో గుకేష్ తన నియంత్రణను కోల్పోయాడు. అదే సమయంలో ప్రజ్ఞానంద తన మంచి టెక్నిక్‌తో గెలిచి తన కెరీర్‌లో తొలిసారి మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

Also Read : Abhishek Sharma : ఓ సరికొత్త రికార్డు సృష్టించిన టీమిండియా యంగ్ ఓపెనర్

Leave A Reply

Your Email Id will not be published!