Radhika Yadav Murder Mystery : టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్ హత్యపై వెలుగులోకి కీలక అంశాలు
అంటూ దీపక్ తన అంగీకారంలో వెల్లడించినట్టు తెలుస్తోంది..
Radhika Yadav : గురుగ్రామ్‌లో క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తన ఇంట్లోనే కన్న తండ్రి దీపక్ యాదవ్ చేతిలో ఆమె అతి సమీపం నుంచి కాల్చబడి ప్రాణాలు కోల్పోయిన ఘటన సంచలనంగా మారింది. శనివారం నాడు దీపక్‌ను 14 రోజుల పాటు న్యాయ హిరాసతులోకి పంపుతూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Radhika Yadav Murder Mystery
పోలీసుల దర్యాప్తులో అందిన సమాచారం ప్రకారం, రాధిక (Radhika Yadav) తనకెంటి స్వతంత్రంగా టెన్నిస్ అకాడమీ నిర్వహించడంపై తండ్రికి ఎప్పటి నుంచో అభ్యంతరం ఉండేది. కుటుంబంలో తరచూ తండ్రీకూతుళ్ల మధ్య మాటామాటా పెరిగి గొడవలు జరిగేవని తెలుస్తోంది. ‘‘కూతురు సంపాదన మీద జీవిస్తున్నావన్న విమర్శలు, ఇతరుల మాటలు మనసు మంట పెట్టేశాయి’’ అంటూ దీపక్ తన అంగీకారంలో వెల్లడించినట్టు తెలుస్తోంది.
దీపక్‌కు అనేక ఆస్తులు ఉండగా, ఇంటి అద్దెల రూపంలో నెలవారీ ఆదాయం వస్తోందని పోలీసులు స్పష్టం చేశారు. ఆర్థికంగా బలంగా ఉన్నా, కూతురు చేస్తున్న పని వల్ల తన పరువు దెబ్బతింటోందనే భావనలో దీపక్ ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. కూతురు అకాడమీని మూసివేయాలని అతడు పలుమార్లు చెప్పినా, రాధిక (Radhika Yadav) నిరాకరించడంతో ఘర్షణ తారాస్థాయికి చేరినట్టు సమాచారం. చివరికి ఇదే విషయమే ఆమె హత్యకు దారితీసిందని అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉంటే, హత్యకు ముందు రాధిక తన మాజీ కోచ్‌తో జరిపిన సంభాషణలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాటిలో ఇంట్లో ఆంక్షలు, తన కలల గురించి చెప్పిన విషయాలు ఉన్నాయి. ‘‘జీవితాన్ని స్వేచ్ఛగా గడపాలనుంది, విదేశాలకు వెళ్లాలనుంది’’ అనే భావన ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది. దుబాయ్, ఆస్ట్రేలియా వంటి దేశాల పట్ల ఆసక్తి చూపిందని కోచ్ తెలిపినట్టు సమాచారం. గతంలో చైనాలో ఎదురైన ఇబ్బందుల వల్ల ఇకపై భద్రంగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా చెప్పిందట.
కాగా, తండ్రి తరచూ ‘‘ఎంత కూడబెట్టావ్?’’ అంటూ ఆర్థిక ప్రశ్నలతో ఒత్తిడి తెచ్చేవాడని, డబ్బుల విషయంలోనే ఎక్కువగా విభేదాలు జరిగేవని రాధిక తన కోచ్‌తో చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు అదే కోణాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు విచారణను మరింత లోతుగా కొనసాగిస్తున్నారు.
ఈ కేసులో మానసిక ఒత్తిడి, కుటుంబ విభేదాలు, ఆర్థిక అంశాల సమ్మేళనమే రాధిక హత్యకు దారి తీసిందా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం అవుతోంది.
Also Read : Karun Nair : 8 ఏళ్ల తర్వాత ఛాన్స్ వచ్చిన నిలబెట్టుకోలేకపోతున్న నాయర్
