Rafael Nadal : జోకోవిచ్ పై నెగ్గిన రాఫెల్ నాద‌ల్

ఫ్రెంచ్ ఓపెన్ లో సంచ‌ల‌న విజ‌యం

Rafael Nadal : ప్ర‌పంచ టెన్నిస్ దిగ్గ‌జ ఆట‌గాడు రాఫెల్ నాద‌ల్(Rafael Nadal) మ‌రో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో భాగంగా జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో మ‌రో స్టార్ ప్లేయ‌ర్ నొవాక్ జొకోవిచ్ ను ఓడించాడు.

ఇక నాద‌ల్ చేతిలో నొవాక్ ఓడి పోవ‌డం ష‌రా మామూలుగా మారింది. జొకోవిచ్ పై నెగ్గ‌డంతో సెమీ ఫైన‌ల్స్ కు చేరాడు నాద‌ల్.

బుధ‌వారం తెల్ల‌వారుజామున జ‌రిగ‌న మ్యాచ్ లో త‌న పాత ప్ర‌త్య‌ర్థి నొవాక్ జొకోవిచ్ పై వ‌రుస‌గా నాలుగు సెట్ల‌లో త‌న 15వ ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైన‌ల్ కు చేరుకున్నాడు. 6-2, 4-6, 6-2 , 7-6 తో ఓడించాడు.

మ్యాచ్ మొత్తం నాలుగు గంట‌ల 12 నిమిషాల పాటు కొన‌సాగింది. రాఫెల్ నాదల్ గ‌త ఏడాది విజేత జొకోవిచ్ తో జ‌రిగిన 10 ఫ్రెంచ్ ఓపెన్ మ్యాచ్ ల‌లో త‌న ఎనిమిదో విజ‌యాన్ని సాధించాడు.

వ‌రుస‌గా ఇన్నిసార్లు గెల‌వ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం. శుక్ర‌వారం మూడో సీడ్ అలెగ్జండ‌ర్ జ్వెరెవ్ తో రాఫెల్ నాద‌ల్ త‌ల‌ప‌డ‌తాడు. మ్యాచ్ అనంత‌రం గెలుపొందిన రాఫెల్ నాద‌ల్ స్పందించాడు.

నేను చాలా ఎమోష‌న‌ల్ గా ఉన్నాను. ఇక్క‌డ ఆడ‌టం నాకు ఆనందాన్ని ఇచ్చింద‌ని చెప్పాడు రాఫెల్ నాద‌ల్(Rafael Nadal). ఇదిలా ఉండ‌గా త‌న‌కు మిగ‌తా ఆట‌గాళ్ల‌తో ఆడ‌టం కంటే స‌మ ఉజ్జీ అయిన నొవాక్ జొకోవిచ్ తో ఆడుతున్న‌ప్పుడు అద్భుతంగా ఉంటుంద‌న్నాడు నాద‌ల్.

నోవాక్ పై గెల‌వాలంటే ఒకటే మార్గం ఉంది. అదేమిటంటే మొద‌టి పాయింట్ నుండి చివ‌రి వ‌ర‌కు అత్యుత్త‌మంగా ఆడ‌ట‌మేన‌ని పేర్కొన్నాడు.

35 ఏళ్ల నాద‌ల్ 2005 టైటిల్ విజేత ఆరంగేట్రం నుండి పారిస్ కేలో త‌న 113 మ్యాచ్ ల‌లో కేవ‌లం మూడింటిని మాత్ర‌మే కోల్పోయాడు.

Also Read : ఆసియా క‌ప్ భారత్ ఆశ‌లు ఆవిరి

Leave A Reply

Your Email Id will not be published!