Rahul Bajaj : పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ కన్నుమూత
83 ఏళ్ల వయసులో సెలవు తీసుకున్న వ్యాపారవేత్త
Rahul Bajaj : భారత దేశం వ్యాపార రంగానికి ఇవాళ తీరని లోటుగా చెప్పక తప్పదు. ప్రముఖ వ్యాపార దిగ్గజం రాహుల్ బజాజ్(Rahul Bajaj )83 ఏళ్ల వయసులో కన్ను మూశారు. ఇవాళ పుణెలో ఆయన మృతి చెందినట్లు కుటుంబీకులు వెల్లడించారు.
బజాజ్ ఆటో మాజీ చైర్మన్ గా ఉన్నారు. ఈ దేశంలో హమారా బజాజ్ అన్న నినాదం ప్రతి భారతీయుడి హృదయాన్ని తాకింది. బజాజ్ అనే సరికల్లా దేశంలో ఆటోలతో పాటు స్కూటర్ కూడా గుర్తుకు వస్తుంది.
అంతలా ఆయన తన సంస్థలను తీర్చి దిద్దారు. ఇవాళ గొప్ప వ్యాపార వేత్తను కోల్పోవడం బాధాకరమని ప్రధాని పేర్కొన్నారు. ఇక దేశంలో పేరొందిన పది మంది పారిశ్రామికవేత్తలలో రాహుల్ బజాజ్ ఒకరు.
ఇదిలా ఉండగా కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు గత సంవత్సరం బజాజ్ ఆటో సంస్థ ప్రకటించింది.
1972 నుంచి కంపెనీకి ఐదు దశాబ్దాల పాటు బజాజ్ గ్రూప్ కు సారథ్యం వహించిన రాహుల్ బజాజ్(Rahul Bajaj )తన వయసును దృష్టిలో పెట్టుకుని రాజీనామా చేసినట్లు బజాజ్ ఆటో సంస్థ వెల్లడించింది.
గత ఐదు దశాబ్దాలుగా కంపెనీ , సంస్థల విజయానికి రాహుల్ బజాజ్ భారీ సహకారం అందించారు. ఆయన అద్భుతమైన అనుభవం మరింత సక్సెస్ సాధించేలా చేసింది.
సంస్థకు సలహాదారుగా అందించిన సేవలు, చేసిన సూచనలు ఎప్పటికీ నిలిచే ఉంటాయని సంస్థ ఇవాళ ప్రకటించింది. మార్గదర్శకుడిని, నైపుణ్యం కలిగిన నాయకుడిని, మానవతా దృక్ఫథం కలిగిన మానవుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొంది.
Also Read : రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు