Rahul Dravid : హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్
ప్రకటించిన బీసీసీఐ
Rahul Dravid : ముంబై – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సంచలన ప్రకటన చేసింది. ఇప్పటి వరకు టీమిండియా జట్టుకు ప్రధాన (హెడ్ ) కోచ్ గా ది వాల్ గా గుర్తింపు పొందిన రాహుల్ ద్రవిడ్ కు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు ఆయన కాంట్రాక్టును కంటిన్యూ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. బుధవారం అధికారిక ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ద్రవిడ్ తో పాటు సహాయక సిబ్బందికి కూడా కాంట్రాక్ట్ ను పొడిగిస్తున్నట్లు పేర్కొంది.
Rahul Dravid Present Designation
ఇదిలా ఉండగా భారత దేశంలో బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేపట్టింది. ఫైనల్ దాకా వచ్చింది. ఆసిస్ చేతిలో బోల్తా పడింది. ఇప్పటి వరకు 2 సంవత్సరాలకు కాంట్రాక్టు కుదుర్చుకుంది రాహుల్ ద్రవిడ్ తో.
ఇవాళ్టితో ఆయన గడువు ముగిసింది. దీంతో ద్రవిడ్(Rahul Dravid) కు బదులు వీవీఎస్ లక్ష్మణ్ కు హెడ్ కోచ్ గా బాధ్యతలు అప్పగిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ వీటన్నింటిని పటాపంచలు చేస్తూ బీసీసీఐ ఊహించని రీతిలో ది వాల్ వైపు మొగ్గింది.
కాంట్రాక్ట్ పునరుద్దరణ తర్వాత తన మొదటి అసైన్ మెంట్ దక్షిణాఫ్రికాతో తిరిగి మొదలవుతుంది. ఇదిలా ఉండగా జట్టులో ఆత్మ స్థైర్యం పెంపొందించడంలో రాహుల్ ద్రవిడ్ పాత్ర కీలకమైనదని , అందుకే కాంట్రాక్టు పొడిగించడం జరిగిందని బీసీసీఐ తెలిపింది.
Also Read : Anurag Thakur : మహిళా సంఘాలకు డ్రోన్లు