Rahul Dravid : సఫారీ టూర్ సందర్భంగా వన్డే, టెస్టు సీరీస్ లు ఓడి పోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid). వచ్చిన అవకాశాలను తాము వంద శాతం ఉపయోగించు కోలేక పోయామని ఒప్పుకున్నాడు.
ఇందులో సాకులు వెతకాల్సిన పని లేదన్నాడు. జట్టులో సమతుల్యత లోపించిందన్నది వాస్తవమేనని పేర్కొన్నాడు ద్రవిడ్. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఆరు, ఏడు స్థానాల్లో తమ ఆల్ రౌండ్ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు అందుబాటులో లేక పోవడం ప్రధాన కారణమన్నాడు.
బ్యాటింగ్, బౌలింగ్ పరంగా మిడిల్ ఆర్డర్, ఓవర్లలో పేలవమైన ప్రదర్శన కూడా ఓడి పోవడానికి అసలు కారణమని స్పష్టం చేశాడు రాహుల్ ద్రవిడ్. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ పరంగా ఓకే ఉన్నా పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నాడు.
ఇప్పటికిప్పుడు వంద శాతం ఫలితాలు రావాలంటే కష్టమన్నాడు. కొంచెం టైం పడుతుందని భారత జట్టు తన విజయాల పట్టేందుకన్నాడు. వెంకటేష్ అయ్యర్ ను ఎందుకు ఉపయోగించ లేదన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు ద్రవిడ్(Rahul Dravid).
దీని గురించి ఇప్పుడేమీ కామెంట్ చేయదల్చు కోలేదన్నాడు. అంతర్జాతీయ పరంగా కొంత అనుభవం లేక పోవడం కూడా నాయకత్వ పరంగా కొంత ఇబ్బంది ఏర్పడిందని ఆ విషయాన్ని తాను కూడా అంగీకరిస్తున్నట్లు చెప్పాడు రాహుల్ ద్రవిడ్.
వెంకటేశ్ అయ్యర్, పాండ్యా, జడేజా ఆరు, ఏడు స్థానాలలో సరిగా సరిపోతారని పేర్కొన్నాడు ద్రవిడ్. జట్టు పరంగా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Also Read : అన్నిసార్లు విజయాలు దక్కవు