Rahul Dravid Iyer : శ్రేయస్ అయ్యర్ పై ద్రవిడ్ కామెంట్స్
ఏ ప్లేస్ అన్నది ఇంకా నిర్ణయించ లేదు
Rahul Dravid Iyer : ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో భారత జట్టు 2వ టెస్టు ఆడనుంది ఫిబ్రవరి 17 శుక్రవారం నుంచి. ఇప్పటికే నాలుగు టెస్టుల సీరీస్ లో భాగంగా నాగ్ పూర్ లో జరిగిన మొదటి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో భారత జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా జోరు మీదుంది.
మరో వైపు పోయిన పరువు కాపాడు కోవాలని పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఇక మ్యాచ్ ప్రారంభం కంటే ముందు భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక కామెంట్స్ చేశాడు.
శ్రేయస్ అయ్యర్(Rahul Dravid Iyer) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఏ ప్లేస్ లో వస్తాడనేది చెప్పలేనని పేర్కొన్నాడు. మంచి టెక్నిక్ ఉన్న ఆటగాడు. ఒక్కోసారి 100 రన్స్ చేయొచ్చు లేదా తక్కువ చేయొచ్చు. ప్రయోగాలు చేసేందుకు తాము సిద్దంగా లేమని పేర్కొన్నాడు. ప్రత్యర్థి జట్టును కూడా తక్కువ అంచనా వేసేందుకు వీలు లేదన్నాడు. మా ఆటగాళ్లు ప్రాక్టీస్ లో నిమగ్నం అయ్యారని దానిపై ఫోకస్ పెడుతున్నారంటూ పేర్కొన్నాడు రాహుల్ ద్రవిడ్.
ఒక వేళ తాను ఫేస్ చేసేందుకు రెడీ అయితే తీసుకునేందుకు తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అతడిని ఆడించాలా లేదా అన్నది ఆలోచిస్తున్నామని చెప్పాడు. రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడారు.
బోర్డు అతడి ఫిట్ నెస్ పై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఓకే అయితే జట్టులో ఆడిచేందుకు అభ్యంతరం లేదన్నాడు ద్రవిడ్.
Also Read : బీసీసీఐ ముందు ఐసీసీ బలాదూర్