Rahul Dravid : ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆటల్లో క్రికెట్ ఒకటి. ఇందులో సందేహం లేదు. ప్రతి ఆటలో గెలుపు ఓటములు ఉంటాయి. కానీ ఎన్నో మైలు రాళ్లు మరెన్నో అద్భుతమైన రికార్డులు పొందు పర్చబడి ఉంటాయి.
క్రికెట్ ప్రయాణంలో ఎందరో మనల్ని ప్రభావితం చేస్తారు. అలాంటి ప్లేయర్లలో ఒకడు విరాట్ కోహ్లీ అని పేర్కొన్నారు భారత క్రికెట్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid).
ఇవాళ తన కెరీర్ లో కోహ్లీ మొహాలీ వేదికగా 100వ టెస్టు ఆడుతున్నాడు. దీనిని పురస్కరించుకుని కోహ్లీని భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ సన్మానం చేసింది.
ఇదే సమయంలో రాహుల్ ద్రవిడ్ కూడా అరుదైన ట్రోఫీని కోహ్లీకి అందజేశాడు. ఈ సందర్భంగా కొద్ది సేపు భావోద్వేగంతో ప్రసంగించాడు ద్రవిడ్(Rahul Dravid). క్రికెట్ ఆటలో గొప్పతనానికి, నిబద్దతకు నిదర్శనం విరాట్ కోహ్లీ అన్నాడు.
ఈ మైలు రాయిని అందుకున్న 12వ ఆటగాడిగా నిలిచాడు. క్రికెట్ లో కోహ్లీ లాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారని స్పష్టం చేశాడు.
అకుంఠితమైన దీక్ష, పట్టుదల, ఆట పట్ల కసి, ధైర్యం, నైపుణ్యం, దృఢ సంకల్పం, కోరిక, ఏకాగ్రత కలిగి ఉన్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ అని కితాబు ఇచ్చాడు రాహుల్ ద్రవిడ్.
ఇన్నేళ్లుగా ఆడుతూ ఉండడం ఆట్ల పట్ల పేషన్ ఉండడమే. తను ఆడుతూ ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ నేటి తరాలకే కాదు భావి తరాలకు కూడా కోహ్లీ ఆదర్శ ప్రాయంగా ఉంటాడని పేర్కొన్నాడు.
ఈ అద్భుత విజయాన్ని సాధించినందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకు అభినందనలు అని తెలిపాడు ద్రవిడ్. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడాడు. ఈ కార్యక్రమంలో కోహ్లీతో పాటు భార్య అనుష్క కూడా పాల్గొంది.
Also Read : క్రికెట్ కు వన్నె తెచ్చిన ఆటగాడు కోహ్లీ