Rahul Gandhi : ఉగ్రవాదం గురించి మోదీకి ఏం తెలుసు
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో మోదీ కొలువు తీరాక విద్వేషం తప్ప ఇంకేదీ అమలు కాలేదన్నారు. కులం పేరుతో, మతం పేరుతో విద్వేష రాజకీయాలను ఎగదోస్తున్న చరిత్ర బీజేపీకి ఉందన్నారు.
కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బెలగావిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ప్రధానమంత్రి ఉగ్రవాదం గురించి పదే పదే మాట్లాడుతున్నారని ఉగ్రవాదం గురించి, టెర్రరిస్టుల ఆగడాల గురించి తనకు బాగా తెలుసన్నారు.
తన నాయినమ్మ ఇందిరా గాంధీ సిక్కు తీవ్రవాదుల నుంచి ప్రాణాలు కోల్పోయిందని, చివరకు తన తండ్రి రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) సైతం అదే తీవ్రవాదానికి ఎల్టీటీఈ తీవ్రవాదుల కుట్రకు బలై పోయాడని గుర్తు చేసుకున్నారు. మరి ప్రధాన మంత్రి కుటుంబం కానీ లేదా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థల నుంచి ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా అని ప్రశ్నించారు.
ఈ దేశంలో ఎవరు ప్రాణాలు కోల్పోయారో 145 కోట్ల భారతీయులకు తెలుసన్నారు రాహుల్ గాంధీ. ప్రజలను మోసం చేయడం తప్ప మోదీకి మిగిలింది ఏమీ లేదన్నారు . తాజాగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో భారీ రోడ్ షో చేపట్టారు. పెద్ద ఎత్తున జనం స్వాగతం పలికారు.
Also Read : టెక్నాలజీ కీలకం న్యాయవ్యవస్థకు అవసరం