Rahul Gandhi Comment : రాటు దేలిన రాహుల్ గాంధీ

మోదీకి ప్ర‌త్యామ్నాయంగా మారిన నేత

Rahul Gandhi Comment : రాహుల్ గాంధీ ఇప్పుడు కాద‌న‌లేని, విస్మ‌రించ లేని నాయ‌కుడు. ఒక‌ప్పుడు వివిధ అంశాల‌కు సంబంధించి మాట్లాడ‌టంలో ఇబ్బంది ప‌డిన ఆయ‌న రాను రాను రాటు దేలారు. త‌న‌దైన ముద్ర వేస్తూ దూసుకు పోతున్నారు. రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆయ‌న త‌న ప‌నితీరు, త‌న పొలిటిక‌ల్ భావ‌జాలాన్ని కూడా మార్చేసుకున్నారు. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మోదీ స‌ర్కార్ పై బాణాలు సంధిస్తున్నారు. దీంతో ఇప్పుడు మ‌రోసారి బీజేపీ శ్రేణుల్లో గుబులు మొద‌లైంది.

ఆయ‌న ప్ర‌క‌టించిన ఏకైక నినాదం దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ అన్న‌ది ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఇక రాహుల్ గాంధీ ఎలా జాతీయ నాయ‌కుడిగా ఎదుగుతున్నారో చూస్తే అర్థమ‌వుతోంది. 

వేలాది మంది ఆయ‌న అడుగు జాడ‌ల్లో న‌డుస్తున్నారు. కొంద‌రు మోదీ భ‌యానికి రాక పోయినా సినీ రంగానికి చెందిన న‌టీన‌టులు కూడా రాహుల్ తో(Rahul Gandhi) చేతులు క‌ల‌ప‌డం విస్తు పోయేలా చేసింది.

ఇక రాహుల్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. గెలుపు ఓట‌ముల‌ను స‌మానంగా స్వీక‌రించ‌డం ..భ‌విష్య‌త్ ప‌ట్ల అచంచ‌ల‌మైన విశ్వాసం..ప్ర‌జ‌ల ప‌ట్ల ప్రేమ‌..చేసే ప‌నిలో న‌మ్మ‌కం ఇవే రాహుల్ గాంధీని జాతీయ నాయ‌కుడిగా నిల‌బెట్టేలా చేస్తున్నాయి.

ఎవ‌రు ఔన‌న్నా..కాద‌న్నా ఆయ‌న రోజు రోజుకు జాతీయ రాజ‌కీయాల్లో విస్మ‌రించ‌లేని నేత‌గా ఎదుగుతున్నారు. త‌న‌ను తాను స‌రిదిద్దుకుంటూనే కీల‌క స‌మ‌స్య‌ల‌పై పోరాడేందుకు సై అంటున్నారు.

గాంధీ కుటుంబం నుండి వ‌చ్చిన ఈ యువ నాయ‌కుడు ఏది మాట్లాడినా ఇపుడు ఓ సంచ‌ల‌నంగా మారుతోంది. భార‌తీయ రాజ‌కీయాల‌ను వంట బ‌ట్టించుకున్నారు. ఎత్తుకుల‌కు పై ఎత్తులు వేయ‌డం రాక పోయినా..భారీ చ‌రిస్మా క‌లిగిన మోడీని ఢీ కొన‌డంలో స‌క్సెస్ అయ్యారు.

నోట్ల ర‌ద్దు విష‌యంలో ప్ర‌తిప‌క్షాల‌తో క‌లిసి పోరుబాట ప‌ట్టారు. ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఆందోళ‌న నిర్వ‌హించారు. లెక్క‌లేనంత సెక్యూరిటీని కాద‌ని సామాన్యుల ద‌గ్గ‌ర‌కు వెళుతున్నారు.

వారిని ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ..ముందుకు సాగుతున్నారు. భావ‌సారూప్య‌త క‌లిగిన వ్య‌క్తులు, వ్య‌వ‌స్థ‌ల‌తో మిలాఖ‌త్ అవుతున్నారు.

ఈ దేశానికి ఏం కావాలో మీరే తేల్చుకోమ‌ని ఆయ‌న స‌వాల్ విసురుతున్నారు. తాము పండించిన పంట‌కు మ‌ద్ధ‌తు ధ‌ర కావాలంటూ దేశ న‌లుమూల‌ల

నుండి ఢిల్లీకి వ‌చ్చిన రైతుల‌కు రాహుల్ గాంధీ అండ‌గా నిల‌బ‌డ్డారు.

పార్టీని, త‌న‌ను విభేదించినా స‌రే ఆయా రాష్ట్రాల్లో పాగా వేసిన ప‌లు పార్టీల‌తో స‌యోధ్య కుదుర్చుకునేందుకు మార్గం సుగ‌మం చేస్తున్నారు.

నిన్న‌టి దాకా పప్పు..అని ..రాజ‌కీయాల్లో ఏమీ తెలియ‌ని బ‌చ్చా అని లూజ్ కామెంట్స్ చేసిన వారు సిగ్గుప‌డేలా రాహుల్ గాంధీ ..దేశ్ కీ నేత‌గా కీర్తించే స్థాయికి చేరుకున్నారు. రాజ‌కీయంగా..ప‌వ‌ర్‌ఫుల్ అయిన మోడీ, అమిత్ షా టీంను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటున్నారు. 

అంతేకాకుండా మోడీపై నిప్పులు చెరుగుతూ ఆయ‌న చేస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై నిగ్గ‌దీసి నిల‌దీస్తున్నారు రాహుల్‌జీ(Rahul Gandhi). మోడీ త‌న ప‌రివారానికి ఎలా ప్ర‌జా ధ‌నాన్ని క‌ట్ట‌బెట్టారో అంకెల‌తో స‌హా బ‌య‌ట పెట్టారు. 

రాఫెల్ కుంభ‌కోణం మోడీని నిద్ర పోనీయ‌కుండా చేశారు. నోట్ల ర‌ద్దుపై నిప్పులు చెరిగారు. ప్ర‌జ‌ల‌ను బిచ్చ‌గాళ్ల‌ను చేశార‌ని..త‌మ డ‌బ్బులు 

తీసుకునేందుకు రోడ్ల‌పైకి తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త క‌మ‌లానిదేనంటూ ఆరోపించారు.

ప్ర‌జ‌ల కోసం తాను జైలుకు వెళ్ల‌డానికైనా సిద్ధంగా ఉన్నాన‌ని రాహుల్ గాంధీ ప్ర‌క‌టించ‌డం విస్మ‌యానికి గురి చేసింది.

ఏ స‌మ‌స్య అయినా దానిని అర్థం చేసుకోవ‌డం..ప‌రిశీలించు కోవ‌డం..అది క‌రెక్టా కాదా అని తెలుసుకోవ‌డంలో మ‌రింత శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నారు.  త‌న త‌ల్లి సోనియాగాంధీకి తోడుగా..త‌న చెల్లెలు ప్రియాంక గాంధీ స‌పోర్ట్‌తో రాహుల్ మ‌రింత రాటుదేలుతున్నారు. 

సీనియ‌ర్లు, జూనియ‌ర్లు..యంగ్ ప్రొఫెష‌న‌ల్స్‌తో ఇపుడు రాహుల్ స్పెష‌ల్ టీంను ఏర్పాటు చేసుకున్నారు. 

మోస్ట్ టాలెంటెడ్‌, ఎక్స్‌పీరియ‌న్స్ ప‌ర్స‌న్స్‌, ప్రొఫెస‌ర్స్‌, స‌బ్జెక్ట్ ఎక్స్‌ప‌ర్ట్స్‌, ఐటీ ప్రొఫెస‌న‌ల్స్‌..పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌ను ఆయ‌న ఏరికోరి ఎంచుకున్నారు. ఇందులో ఐఐఎం, ఐఐటీ, ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఉన్నారు.

ఒక‌ప్పుడు మీడియాకు అంత‌గా టైం ఇచ్చే వారు కాదు..ఇపుడు ఇండియాలో ఏ స‌మ‌స్యపైనా అన‌ర్ఘ‌లంగా మాట్లాడేందుకు రాహుల్ రెడీగా ఉన్నారు. దేశ ఆర్థిక రంగాన్ని నిర్వీర్యం చేస్తూ..ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల్లోకి నెట్టిన పాప‌మంతా మోడీ, అమిత్ షాల‌దేన‌ని ఆరోపించారు.

ఆర్థిక నేర‌గాళ్ల‌కు వ‌త్తాసు ప‌లుకుతూ ..నిరంకుశ పాల‌న సాగిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. సోనియా గాంధీ త‌ర్వాత ఎవ‌రు అని ఆందోళ‌నకు గురైన కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు రాహుల్ గాంధీ(Rahul Gandhi) చుక్కానిలా అగుపించారు. 

ఏది ఏమైనా భార‌త్ జోడో యాత్ర దేశంలో ఓ పెను సంచ‌ల‌నం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : సుస్థిర అభివృద్ది కేంద్రం ల‌క్ష్యం

Leave A Reply

Your Email Id will not be published!