Rahul Gandhi : వాయు కాలుష్య సంక్షోభం పై ప్రతి ఎంపీ చర్చించాల్సిన బాధ్యత ఉంది

వాతావరణ కాలుష్యం వల్ల పేద ప్రజానీకం ఎక్కువగా ప్రభావితమవుతున్నారు....

Rahul Gandhi : ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం జాతీయ విపత్తని, ఒకరిపై మరొకరు రాజకీయ నిందారోపణలు చేసుకోకుండా కలిసికట్టుగా దీనికి పరిష్కారం కనుగొనాలని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన సంక్షోభమని, ఇందువల్ల మన పిల్లల భవిష్యత్తు, పెద్దల ఆరోగ్యం, పర్యావరణం, ఆర్థిక విపత్తుతో పాటు అనేకమంది జీవితాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. ఈ మేరకు పర్యావరణ వేత్త విమ్‌లేందు ఝాతో ఇండియా గేట్ వద్ద జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో రాహుల్ పోస్ట్ చేశారు.

Rahul Gandhi Comment

”వాతావరణ కాలుష్యం వల్ల పేద ప్రజానీకం ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. తమను చుట్టుముడుతున్న విషగాలుల నుంచి వారు తప్పించుకులేకుంటారు. విషపూరిత వాతావరణం వల్ల పర్యాటకం, గ్లోబల్ రెప్యుటేషన్ తగ్గుతోంది. విషపూరితంగా మారుతున్న వాతావరణాన్ని శుభ్రం చేయాల్సి ఉంది. కాలుష్య మేఘాలు వేలాది కిలోమీటర్లు విస్తరిస్తున్నందున ప్రభుత్వాలు, కంపెనీలు, నిపుణులు, పౌరులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. రాజకీయ నిందారోపణలు చేసుకోకుండా సమష్టి జాతీయ బాధ్యతగా గుర్తించి పరిష్కారం కనుగొనాలి” అని రాహుల్ అన్నారు. మరికొద్ది రోజుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని, వాయు కాలుష్య సంక్షోభంపై సమగ్రంగా చర్చించాల్సిన బాధ్యత ఎంపీలపై ఉందని రాహుల్ అన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తరభారతదేశం లోని పలు ప్రాంతాలు, ముఖ్యంగా ఢిల్లీ, సరిహద్దు సిటీలైన నొయిడా, ఘజియాబాద్, గురుగావ్, ఫరీదాబాద్‌లు గత కొద్ది వారాలుగా తీవ్రవాయికాలుష్యంతో విలవిల్లాడుతున్నారు.

Also Read : PM Modi Tour : ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో కీలక అంశాలు ఇవే..

Leave A Reply

Your Email Id will not be published!