Rahul Gandhi : తనకంటే తన సోదరి మొదటి స్పీచ్ లో బాగా మాట్లాడింది

రాహుల్ గాంధీ 2004లో తొలిసారి ఎంపీ అయ్యారు...

Rahul Gandhi : దేశ రాజ్యాంగ నిర్మాణం జరిగి 75 ఏళ్లు అయిన సందర్భంగా రాజ్యాంగంపై పార్లమెంటులో శుక్రవారం జరిగిన చర్చలో కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. పార్లమెంటులో జరిగిన చర్చలో ప్రియాంక గాంధీ మాట్లాడటం ఇదే మొదటిసారి. తొలి స్పీచ్‌లోనే ఆమె లేవనెత్తిన అంశాలు, ప్రభుత్వాన్ని నిలదీసిన తీరుపై ఆయన సోదరుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రశంసలు కురిపించారు. ప్రియాంక సభలో మాట్లాడుతున్నప్పుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎంతో ఆసక్తిగా విన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తన తొలి ప్రసంగం కంటే ప్రియాంక మెరుగైన ప్రసంగం చేసిందన్నారు. ”అద్భుతమైన ప్రసంగం. పార్లమెంటుకు నేను తొలిసారి ఎంపీ అయినప్పుడు చేసిన ప్రసంగంతో పోలిస్తే ప్రియాంక తొలి ప్రసంగం చాలా బాగుంది” అని మీడియా అడిగిన ప్రశ్నకు రాహుల్ సమాధానమిచ్చారు. రాహుల్ గాంధీ 2004లో తొలిసారి ఎంపీ అయ్యారు. ప్రియాంక గాంధీ 2024లో జరిగిన వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో తొలిసారి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు.

Rahul Gandhi Comment

రాజ్యాంగంపై శుక్రవారంనాడు జరిగిన చర్చలో ప్రియాంక తొలిసారి పాల్గొంటూ, జాతీయ ఐక్యత, మహిళా సాధికారక, రాజ్యాంగ పరిరక్షణ అవసరాన్ని బలంగా చెప్పారు. భారత రాజ్యాంగం మహిళలకు అధికారం ఇచ్చిందని, కానీ మహిళలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని, తన హక్కుల కోసం వాళ్లు మరో పదేళ్లు వేచిచూడాలా అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రజల ‘సురక్షా కవచం’ అని, గత పదేళ్ళుగా కేంద్ర ప్రభుత్వ ఆ రక్షణ కవచాన్ని బద్ధలు కొట్టేందుకు సర్వవిధాలా ప్రయత్నిస్తోందని విమర్శించారు. వాళ్లు తృటిలో ఓటమి నుంచి తప్పించుకుని గెలిచారని, దేశానికి తక్షణ అవసరం కులగణన అని చెప్పారు. విధానాల రూపకల్పనకు కులగణన అవసరమని, దేశ ప్రజలు సైతం కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. బ్యాలెట్‌తో ఎన్నికలపై ప్రస్తుతం జరుగుతున్న చర్చను ప్రస్తావిస్తూ, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే నిజం నిగ్గుతేలుతుందని అన్నారు. సంభాల్ హింస, ఉన్నావో అత్యాచారం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను సైతం ప్రియాంక తన ప్రసంగంలో ప్రస్తావించారు.

Also Read : Minister Bandi Sanjay : హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన కేంద్రమంత్రి

Leave A Reply

Your Email Id will not be published!