Rahul Gandhi ED : ఈడీ ముందుకు రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో సమన్లు
Rahul Gandhi ED : నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి సోమవారం కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కానున్నారు.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈడీ ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి కూడా సమన్లు జారీ చేసింది. కానీ ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో తాను హాజరు కాలేనంటూ, ఆరోగ్యం కుదట పడిన తర్వాత వస్తానని తెలిపింది.
ఆదివారం ఆరోగ్య పరంగా ఇబ్బందులు తలెత్తడంతో సోనియా గాంధీని ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి ఈడీ వెసులుబాటు ఇచ్చింది ఆమె హాజరుకు సంబంధించి.
ఇక నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి గతంలో నమోదైన కేసులో ఎలాంటి ఆధారాలు లభించక పోవడంతో కొట్టి వేశారు. కానీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ కొలువు తీరాక కేసును రీ ఓపెన్ చేశారు.
దీనికి ప్రధాన కారణం బీజేపీకి చెందిన మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్య స్వామి. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిర్వహణలో మనీ లాండరింగ్ జరిగిందంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఈడీ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే నోటీసులు జారీ చేసింది. దీంతో విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన రాహుల్ గాంధీ(Rahul Gandhi ED) తాను ఎలాంటి తప్పు చేయలేదని బాజాప్తాగా హాజరు అవుతానంటూ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా కేంద్ర సర్కార్ కావాలని సోనియా, రాహుల్ గాంధీ(Rahul Gandhi ED)లను ఇరికించేందుకు ఇలాంటి తప్పుడు కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
Also Read : ఈడీని అప్పగిస్తే ఫడ్నవిస్ ఓటు మాకే