Rahul Gandhi: ప్రధాని మోదీ మణిపూర్ ను సందర్శించాలి – కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

ప్రధాని మోదీ మణిపూర్ ను సందర్శించాలి - కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

Rahul Gandhi: కుకీ, మైతేయి తెగల మధ్య అల్లర్లతో హింస చెలరేగిన మణిపూర్‌ రాష్ట్రాన్ని ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించాలని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆయన ఇటీవల మూడోసారి మణిపూర్‌ సందర్శించిన వీడియోను తన సోషల్ మీడియా‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

Rahul Gandhi Comment

“మణిపూర్‌ ఇంకా ఆందోళనలోనే ఉంది. జాతుల మధ్య చెలరేగిన హింసలో ఇళ్లు కాలిపోయాయి. అమాయక ప్రజలు ప్రమాదంలో పడ్డారు. వేల కుటుంబాలు నిరాశ్రయులై సహాయక శిబిరాల్లో ఉన్నారు. నేను 2023 మే నుంచి ఇప్పటివరకు మూడుసార్లు మణిపూర్‌కు వెళ్లాను. ఇప్పటికే కూడా మణిపూర్‌ రెండు ప్రాంతాలుగా విడిపోయి ఉంది. ఇప్పటికైనా ప్రధాని మోదీ మణిపూర్‌ సందర్శించాలి. అక్కడి ప్రజలు సమస్యలు విని, శాంతిని నెలకొల్పాలి” అని రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు.

ఇటీవల మణిపూర్‌లో పర్యటించిన రాహుల్‌ గాంధీ చురచంద్‌పూర్‌ సహాయక శిబిరంలో బాధితులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వం ఇక్కడ ఘర్షణలకు ముగింపు పలకాలని భావిస్తేనే తొందరగా సమస్య పరిష్కారం అవుతుంది. మణిపూర్‌ ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తా. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అని అన్నారు.

గతేడాది మణిపూర్‌లోని కుకీ, మైతేయి జాతుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కాస్త… సింసకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ హింసాత్మక ఘటనల్ల 224 మంది మృతి చెందగా… సుమారు 60 వేల మంది ప్రజలు వలస వెళ్లారు. ఇప్పటికీ కూడా చాలా చోట్ల అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి.

Also Read : Agnipath Scheme: మాజీ అగ్నివీర్‌లకు కేంద్ర బలగాల్లో 10% రిజర్వేషన్‌ !

Leave A Reply

Your Email Id will not be published!