Rahul Gandhi : సంభాల్ పర్యటనను అడ్డుకోవడంపై లోక్ సభలో నిలదీసిన రాహుల్ గాంధీ
పోలీసులు నిరాకరిస్తూ మమ్మల్ని ముందుకు వెళ్లనీయలేదు...
Rahul Gandhi : సంభాల్ హింసాకాండ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న తన కాన్వాయ్‌ను ఘజియాపూర్ సరిహద్దుల్లోనే ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకోవడాన్ని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిలదీశారు. బాధిత ప్రజలను కలుసుకోకుండా అడ్డుకోవడం రాజ్యాంగం తనకు కల్పించిన హక్కును తోసిపుచ్చడమేనని అన్నారు. తన కాన్వాయ్‌ను వదిలిపిట్టి ఒంటరిగా పోలీసులతో కలిసి వెళ్లేందుకు కూడా సిద్ధపడ్డానని, అయితే తన మాటను లెక్కచేయకుండా కొద్దిరోజుల తర్వాత రావాలని అధికారులు చెప్పినట్టు తెలిపారు.
Rahul Gandhi Comments
”మేము సంభాల్ వెళ్లేందుకు ప్రయత్నించాం. పోలీసులు నిరాకరిస్తూ మమ్మల్ని ముందుకు వెళ్లనీయలేదు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధితులను కలుసుకునేందుకు వెళ్లే హక్కు నాకు ఉంది. కానీ వాళ్లు నన్ను ఆపేశారు. నేను ఒంటరిగా పోలీసులతో వెళ్లేందుకు సిద్ధపడ్డా. అందుకు కూడా అధికారులు ఒప్పుకోలేదు. కొద్ది రోజుల తర్వాత వస్తే అప్పుడు అనుమతిస్తామని చెప్పారు. ఇది ఎల్‌ఓపీ, రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకం. మేము కేవలం సంభాల్ వెళ్లి అక్కడ ఏమి జరిగిందో చూడాలనుకుంటున్నాం. ప్రజలను కలుస్తాం. నాకున్న రాజ్యాంగ హక్కును కూడా తోసిపుచ్చుతున్నారు. ఇదీ మన నవీన భారతం, రాజ్యాంగానికి చరమగీతం పాడే ఇండియా, అబేంద్కర్ రాజ్యాంగానికి చెల్లుచీటీ చెప్పే ఇండియా. మా పోరాటం కొనసాగుతుంది” అని ఘజియాబాద్ సరిహద్దుల్లో రాహుల్ మాట్లాడుతూ అన్నారు.
కాగా,హింసాకాండ బాధితులను పరామర్శించే హక్కు లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌కు ఉందని ఆయన సోదరి, వయనాడ్ పార్లమెంటు సభ్యురాలు ప్రియాంక గాంధీ అన్నారు. “సంభాల్‌లో రాహుల్‌ను అడ్డుకోవడం సరికాదు. బాధితులను కలుసుకునే రాజ్యాంగ హక్కు ఆయనకు ఉంది. యూపీ పోలీసులతో ఒంటరిగా వెళ్తానని కూడా ఆయన చెప్పారు. అందుకు కూడా వాళ్లు ఒప్పుకోలేదు. పోలీసుల దగ్గర సమాధానం లేదు. ఈమాత్రం విషయాన్ని కూడా చక్కదిద్దలేని పరిస్థితి ఉత్తరప్రదేశ్‌లో ఉండొచ్చు. శాంతి భద్రతల విషయంలో పట్టువిడువలు లేని ధోరణలో వారెందుకు మాట్లాడుతున్నారు?” అని ప్రియాంక ప్రశ్నించారు.
Also Read : CM Revanth Reddy-Google : ఆ బడా కంపెనీతో పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్న రేవంత్ సర్కార్