Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే ప్రాణం
ఎంపీ రాహుల్ గాంధీ పిలుపు
Rahul Gandhi : ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకు వెళ్లాలంటే ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. శనివారం ముంబై వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే పాల్గొన్నారు.
Rahul Gandhi Comments
ఏ పార్టీకైనా కీలక కార్యకర్తలేనని అన్నారు. మీరందరూ లేక పోతే పార్టీ ఉండదన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలను వెలుగులోకి తీసుకు రావాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందన్నారు. రాబోయే కాలమంతా మనకు అగ్ని పరీక్ష అని అన్నారు.
వచ్చే ఏడాది 2024లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయని చెప్పారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఈ ఎన్నికల్లో అవినీతికి, నీతికి మధ్య జరుగుతున్న పోరాటం అని స్పష్టం చేశారు. 28 పార్టీలతో కలిసి ఏర్పాటైన ఇండియా కూటమిలో మనం కూడా ఓ భాగం అన్న సంగతి మరిచి పోవద్దన్నారు.
పొత్తులో భాగంగా సమన్వయ కమిటీ ఎవరెవరిని ఎక్కడ నిలపాలో నిర్ణయిస్తుందన్నారు. దేశ భవిష్యత్తు కోసం దీనిని మరో స్వతంత్ర పోరాటంగా చూడాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం వైఫల్యాల గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కోరారు రాహుల్ గాంధీ.
Also Read : Muttireddy Yadagiri Reddy : ముత్తిరెడ్డి అర్దనగ్న ప్రదర్శన