Rahul Gandhi: కేంద్ర ఎన్నికల వ్యవస్థపై రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు

కేంద్ర ఎన్నికల వ్యవస్థపై రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు

Rahul Gandhi : కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ఎన్నికల వ్యవస్థ రాజీ పడినట్లు కనిపిస్తోందని, ఆ వ్యవస్థలోనే ఏదో తప్పు ఉందంటూ వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రస్తావననూ ఆయన తీసుకొచ్చారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ బోస్టన్‌ లో ప్రవాస భారతీయులు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఎన్నికల సంఘంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi Shocking Comments on Election Commission

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడుతూ… ‘ఎన్నికల సంఘం(Election Commission) రాజీ పడింది. ఆ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని మాకు స్పష్టంగా తెలుసు. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇటీవల మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 గంటల మధ్య అక్కడ 65 లక్షల మంది ఓటు వేశారు. ఈ విషయం స్వయంగా ఎన్నికల సంఘమే మాతో పేర్కొంది. ఇది భౌతికంగా అసాధ్యమైనది. ఒక్కో ఓటర్‌ ఓటు వేయడానికి సుమారు 3 నిమిషాలు పడుతుంది. అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేస్తారు. మేము వీడియోలు చూపించాలని అడిగితే ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగటానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు’ అని రాహుల్ ఆరోపించారు.

ఓటర్ల నమ్మకాన్ని రాహుల్‌ గెలవలేకపోయారు – బీజేపీ

కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయన భారతీయ ఓటర్ల నమ్మకాన్ని పొందలేకపోయారని విమర్శలు చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్‌ భండారీ ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ప్రజాస్వామ్యానికి, భారతదేశానికి వ్యతిరేకి అయిన రాహుల్‌ గాంధీ దేశీయ ఓటర్ల నమ్మకాన్ని గెలవలేకపోయారు. ఇప్పుడు విదేశీ గడ్డపై మన దేశ ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రశ్నించడం ప్రారంభించారు’ అని భండారీ విమర్శించారు. ఈసందర్భంగా విదేశాల్లో భారత పరువును పదే పదే ఎందుకు తీస్తారని రాహుల్‌ ను ప్రశ్నించారు. పార్టీ అధికార ప్రతినిధి షెహబాజ్‌ పూనావల్లా సైతం రాహుల్‌ పై విరుచుకుపడ్డారు. అమెరికాలో భారతీయ సంస్థలను, న్యాయస్థానాలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు.

Also Read : Minister Ravneet Singh Bittu: నా హత్యకు ఖలిస్థానీయుల కుట్ర – కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు

Leave A Reply

Your Email Id will not be published!