Rahul Gandhi : విజన్ 2047 పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

మోదీ ప్రభుత్వం 11 ఏళ్లు సేవలను సెలబ్రేట్ చేసుకుంటుంటే....

Rahul Gandhi : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో జవాబుదారీతనం లోపించిందని, కేవలం ప్రచారార్భాటమే కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. వర్తమానం గురించి కేంద్రం మాట్లాడటం మానేసి 2047 గురించి కలలు కంటోందని విమర్శించారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ప్రయాణికులతో కిక్కిరిసిన లోకల్ ట్రైన్ నుంచి కిందపడి నలుగురు ప్రయాణికులు ఆదివారం మృతిచెందడం, ఆరుగురు గాయపడిన ఘటన అనంతరం రాహుల్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విమర్శలు గుప్పించారు.

Rahul Gandhi Comments Viral

మోదీ ప్రభుత్వం 11 ఏళ్లు సేవలను సెలబ్రేట్ చేసుకుంటుంటే.. ముంబై నుంచి వచ్చిన విషాద వార్త వాస్తవ పరిస్థితికి అద్దంపడుతోందని రాహుల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. రైలు నుంచి పడి పలువురు ప్రాణాలు కోల్పోయారని, కోట్లాది మంది ప్రజలకు భారత రైల్వేలు వెన్నెముక వంటిదని, కానీ ఈరోజు ఆ సంస్థ అభద్రత, రద్దీ, గందరగోళానికి చిహ్నంగా మారిందని ఆరోపించారు. ఈరోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలను చూసేదెవరని రైలు ప్రమాద ఘటనను ఉద్దేశించి రాహుల్ అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.#

Also Read : Bengaluru Stampede : తొక్కిసలాట కేసులో కర్ణాటక హైకోర్టు ను ఆశ్రయించిన ఆర్సీబీ

Leave A Reply

Your Email Id will not be published!