Rahul Gandhi : కన్నడ సూపర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ (Puneet) కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi )పరామర్శించారు. రాహుల్ వెంట కర్ణాటక (Karnataka) కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ ఉన్నారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi )శుక్రవారం బెంగళూరులో (Bengaluru) కేపీసీసీ సమావేశానికి హాజరయ్యారు. హాజరయ్యే కంటే ముందు రాహుల్ గాంధీ పునీత్ రాజ్ కుమార్ (Puneet) ఇంటికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా దివంగత నటుడి ఫ్యామిలీతో కాసేపు ముచ్చటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నానని తెలిపారు.
చిన్న వయసులోనే కన్నడ వాసుల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచి పోయారని కితాబు ఇచ్చారు. ఈ సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ సతీమణి, కూతురికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
విచిత్రం ఏమిటంటే రాహుల్ గాంధీ కన్నడ భాషలో ట్వీట్ చేశారు. తను భౌతికంగా ఉన్న సమయంలో కలిశాడని, అద్భుతమైన ఆత్మీయతను కలిగి ఉన్నాడని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు రాహుల్ గాంధీ.
కాంగ్రెస్ (Congress) అగ్ర నాయకుడి వెంట రణ దీప్ సింగ్ నూర్జేవాలా, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ ఎంబీ పాటిల్ , కేంద్ర మాజీ మంత్రి కేహెచ్ మునియప్ప ఉన్నారు.
కాగా పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ 29న 46 ఏళ్ల వయసులో గుండె పోటుతో మరణించారు. పునీత్ ను కన్నడ వాసులు ముద్దుగా అప్పూ అని పిలుచుకుంటారు.
అనంతరం శివైక్యం సాధించిన సిద్దగంగ మఠం పీఠాధిపతి శివకుమార్ స్వామీజీ 115వ జయంతి కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
Also Read : విల్ స్మిత్ అరెస్ట్ కు రంగం సిద్దం – ప్యాకర్