Rahul Tewatia : ఎవరూ ఊహించని రీతిలో గుజరాత్ టైటాన్స్ దుమ్ము రేపుతోంది ఈసారి ఐపీఎల్ లో . మరో వైపు రాజస్థాన్ రాయల్స్ , బెంగళూరు , లక్నో, హైదరాబాద్ నువ్వా నేనా అన్న రీతిలో పోటా పోటీగా ఆడుతున్నాయి.
ఈ తరుణంలో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయింది గుజరాత్ హైదరాబాద్ తో . దీంతో ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఆఖరి ఓవర్ లో మార్కో జేన్సన్ బౌలింగ్ లో తెవాటియా, రషీద్ ఖాన్ దుమ్ము రేపారు.
ఓటమి అంచుల్లో ఉన్న గుజరాత్ కు ఊహించని విజయాన్ని కట్టబెట్టారు. ఈ సందర్భంగా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు వీరిద్దరూ. అనంతరం మీడియాతో మాట్లాడారు రాహుల్ తెవాటియా(Rahul Tewatia).
తాను ఇలా ఆడడానికి కెప్టెన్ హార్దిక్ పాండ్యా, హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాలే కారణమని పేర్కొన్నాడు. వాళ్లిద్దరూ తమపై నమ్మకం ఉంచారని, ఆడేందుకు స్వేచ్ఛ కల్పించారని దీంతో తాను అటాకింగ్ చేశానని చెప్పాడు.
ఒకవేళ వారిద్దరి సహకారం లేక పోతే తాను ఇలా ఆడి ఉండేవాడిని కాదన్నాడు తెవాటియా. గతంలో మ్యాచ్ లు ఆడిన అనుభవం కూడా తనకు పనికి వచ్చిందన్నాడు.
టాప్ ఆర్డర్ కొంత ఇబ్బంది పడినా తాను మాత్రం చివరి దాకా ఉండాలని అనుకున్నానని అదే వర్కవుట్ అయ్యిందన్నాడు తెవాటియా. తాము మైదానంలోకి అడుగు పెట్టామంటే గెలుస్తామనే నమ్మకంతోనే వంద శాతం ఎఫర్ట్ పెడుతున్నట్లు తెలిపాడు.
ఏది ఏమైనా ఒక బలమైన జట్టుతో ఆడడం తనకు సంతృప్తిని ఇచ్చిందన్నాడు.
Also Read : తిప్పేసిన కుల్దీప్ యాదవ్