Rahul Tewatia : గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అంచనా తప్పలేదు. అవసరమైన సమయంలో అద్భుతంగా రాణించాడు ఆ జట్టు ఆటగాడు రాహుల్ తెవాటియా. అంచనాలకు మించి రాణించాడు.
20 మే 1993లో పుట్టాడు. హర్యానా ఇతడి స్వస్థలం. దేశీవాళీ క్రికెట్ లో ఆ రాష్ట్రం తరపున ఆడాడు. ఐపీఎల్ లోకి ఎంటరయ్యాడు. గతంలో రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన రాహుల్ తెవాటియా(Rahul Tewatia) ఈసారి గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు.
ఇతడిని ఏరికోరి ఎంచుకుంది గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు రాహుల్ తెవాటియా. ఎక్కడా తగ్గకుండా ఆడాడు.
కేవలం 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న తెవాటియా 40 రన్స్ చేసి నాటౌట్ గా మిగిలాడు. ఇందులో 4 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. వృద్ది మాన్ సాహా, రషీద్ ఖాన్ తో పాటు రాహుల్ తెవాటియా ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమని చెప్పక తప్పదు.
ఎలాంటి బంతుల్ని అయినా అలవోకగా బౌండరీ లైన్ దాటించే సత్తా ఉన్న ఆటగాడు రాహుల్ తెవాటియా. ఇంగ్లండ్ తో జరిగిన 5 మ్యాచ్ ల సీరీస్ కోసం టీ20 జట్టులో ఎంపికయ్యాడు.
బీసీసీఐ తొలి కాల్ ను అందుకున్న ముగ్గురు అన్ క్యాప్డ ఇండియన్ ఆటగాళ్లలో రాహుల్ తెవాటియా ఒకడు కావడం విశేషం. 2014లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు. 2017లో పంజాబ్ కింగ్స్ తీసుకుంది.
2018లో ఢిల్లీ కేపిటల్స్ చేజిక్కించుకుంది. 2019, 2020లో మళ్లీ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. 2022లో గుజరాత్ దక్కించుకుంది తెవాటియాను.
Also Read : ఐపీఎల్ నిబంధనల్లో మార్పు అవసరం