Rahul Tripathi : రాహుల్ త్రిపాఠి జోరు ముంబై బేజారు
ముంబై బౌలర్లపై ఎదురు దాడి
Rahul Tripathi : ఐపీఎల్ 2022 కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బరిలోకి దిగిన హైదరాబాద్ 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.
అనంతరం 194 టార్గెట్ తో మైదానంలోకి దిగిన ముంబై ఇండియన్స్ 7 వికెట్లు కోల్పోయి 190 రన్స్ కే పరిమితమైంది. ఈ తరుణంలో సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ టామ్ మూడీ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
వరుసగా విఫలమవుతూ వస్తున్న కెప్టెన్ విలియమ్సన్ ను ఓపెనర్ గా తప్పించాడు. మిడిల్ ఆర్డర్ లోకి దించాడు. అభిషేక్ శర్మతో పాటు ప్రియమ్ గార్గ్ ఇన్నింగ్స్ ఓపెన్ చేశాడు. మూడో ఓవర్ లోనే అభిషేక్ వెనుదిరిగాడు.
బరిలోకి దిగిన రాహుల్ త్రిపాఠి(Rahul Tripathi) స్కోర్ ను పరుగులు పెట్టించాడు. సంజయ్ వేసిన ఓవర్ లో రెండు ఫోర్లు కొట్టి తనకు ఎదురు లేదని చాటాడు. జస్ ప్రీత్ బుమ్రాను కూడా వదలలేదు.
వరుసగా 6, 4, 4 కొట్టాడు. గార్గ్, త్రిపాఠి పోటీ(Rahul Tripathi) పడి ఆడారు. రాహుల్ త్రిపాఠి 76 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ లో అతడే టాప్ స్కోరర్. రాహుల్ త్రిపాఠి పూర్తి పేరు రాహుల్ అజయ్ త్రిపాఠి. 2 మార్చి 1991లో పుట్టాడు.
అతడి వయస్సు 31 ఏళ్లు. స్వస్థలం జార్ఖండ్ లోని రాంచీ. కుడి చేతి బ్యాటర్. 2010 నుంచి మహారాష్ట్ర తరపున ఆడుతున్నాడు. 2017 లో రైజింగ్ పూణే సూపర్ జెయొంట్స్ కు ఆడాడు.
2018 నుంచి 2019 దాకా రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. 2020-21 వరకు కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడాడు. ఈసారి ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు.
Also Read : పోరాడి ఓడిన ముంబై గెలిచిన హైదరాబాద్