Revanth Reddy : 7న రాహుల్ బహిరంగ స‌భ – రేవంత్ రెడ్డి

విజ‌య‌వంతం చేయాల‌ని శ్రేణుల‌కు పిలుపు

Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్రకు జ‌నం జేజేలు ప‌లుకుతున్నారు. ఆయ‌న చేప‌ట్టిన యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి ప్రారంభమైంది. త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో పాద‌యాత్ర ముగిసింది.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కొన‌సాగుతోంది. రాహుల్ గాంధీకి అడుగ‌డుగునా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధానంగా కేంద్ర స‌ర్కార్ పై, మోదీ అనుస‌రిస్తున్న విధానాల‌ను ఎండ‌గడుతున్నారు. ఇదిలా ఉండ‌గా న‌వంబ‌ర్ 7న తెలంగాణ‌లో రాహుల్ గాంధీ చేప‌ట్టిన యాత్ర ముగుస్తుంది.

అనంత‌రం ఆరోజు రాత్రి మ‌హారాష్ట్ర‌లోకి ప్ర‌వేశిస్తుంది. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీకి ఘ‌నంగా వీడ్కోలు ప‌ల‌కాల‌ని టీపీసీసీ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి బ‌హిరంగ స‌భ ఏర్పాట్ల‌పై పార్టీ నేత‌లు, శ్రేణుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున వీడ్కోలు స‌భ‌కు హాజ‌రు కావాల‌ని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి(Revanth Reddy).

ఇదే స‌మ‌యంలో మ‌క్త‌ల్ నుంచి నేటి దాకా కొన‌సాగుతున్న రాహుల్ యాత్ర‌కు పెద్ద ఎత్తున జ‌నాద‌ర‌ణ ల‌భించింద‌న్నారు. అన్ని వ‌ర్గాల నుంచి స్పంద‌న‌ను చూసి రాహుల్ గాంధీ సంతోషం వ్య‌క్తం చేశార‌ని పేర్కొన్నారు. 5,6 తేదీల‌లో పాద‌యాత్ర కొన‌సాగుతుంద‌ని ప్ర‌తి ఒక్క‌రు హాజ‌రు కావాల‌ని, విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు రేవంత్ రెడ్డి.

సోమ‌వారం రాత్రి దెగ్లూరులో రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర మ‌రాఠాలో అడుగు పెడుతుంద‌న్నారు పీసీసీ చీఫ్‌.

Also Read : రూ. 100 కోట్లు కాదు 100 పైస‌లకు ప‌నికి రారు

Leave A Reply

Your Email Id will not be published!