Rain Alert : బంగాళాఖాతంలో మరోసారి ముంచుకొస్తున్న అల్పపీడనం

అది డిసెంబర్‌ 7 నాటికి అల్పపీడనంగా మారనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది...

Rain Alert : దక్షిణాదిన దడ పుట్టించిన ఫెంగల్‌ తుపాన్‌(Fengal Cyclone) తీరం దాటడంతో అంతా హమ్మయ్య అనుకున్నారు. ఫెంగల్‌ తుఫాను(Fengal Cyclone) బలహీనపడి అల్పపడీనంగా మారి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. దీంతో ఇప్పట్లో వానలు మళ్లీ రావులే అని జనాలు సంబరపడ్డారు. కానీ ఇంతలో వాతావరణ శాఖ మరో సంచలన వార్త అందించింది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావారణ శాఖ వెల్లడించింది. ఈ మేరక శుక్రవారం వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. డిసెంబర్‌ 6,7 తేదీల్లో ఏర్పడే ఆవర్తనం దక్షిణ దిశగా పయనించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. అది డిసెంబర్‌ 7 నాటికి అల్పపీడనంగా మారనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. అది వాయువ్య దిశగా పయనించి డిసెంబర్ 12 నాటికి తమిళనాడు-శ్రీలంక తీర రేఖకు చేరుకుంటుందని అంచనా. దీని ప్రభావంతో తమిళనాడులోని దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

Rain Alert Updates

చెన్నైలోని కొన్ని ప్రాంతాలు, దాని శివారు ప్రాంతాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 12, 13 తేదీల్లో తమిళనాడులోని దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించింది. ఈ రోజుల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. కాగా ఇప్పటికే ఫెంగల్‌ తుఫాను ప్రభావం నుంచి నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాలు, అటు తమిళనాడు కోలుకోక ముందే తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అనువైన పరిస్థితులు నెలకొనడంతో రైతులు ఆందోళ చెందుతున్నారు. ఆరుగాలం పండించిన పంట ఎక్కడ నీటపాలవుతుందోనన్న భయంతో అందిన కాడికి అమ్మేసుకుంటున్నారు. ఇక ఏపీలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

Also Read : Bangladesh : భారత వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చిన బాంగ్లాదేశ్

Leave A Reply

Your Email Id will not be published!