CSK CEO : ఫామ్ లో లేనందుకే రైనాను తీసుకోలేదు

స్ప‌ష్టం చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ సిఇఓ

CSK CEO : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ – ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. కానీ ఊహించ‌ని రీతిలో బిగ్ స్టార్ ప్లేయ‌ర్ల‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఈసారి బెంగ‌ళూరు వేదిక‌గా నిర్వ‌హించిన మెగా వేలం పాటలో 10 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి.

బీసీసీఐ కొత్త‌గా రెండు ఫ్రాంచైజీల‌కు అవ‌కాశం ఇచ్చింది. వీటి ద్వారా బీసీసీఐకి రూ. 1725 కోట్లు స‌మ‌కూరాయి. ఇక 2022 లో నిర్వ‌హించే ఐపీఎల్ లో మొత్తం 590 మంది ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసింది.

ఇందులో కేవ‌లం 204 మంది ఆట‌గాళ్లు మాత్ర‌మే అమ్ముడు పోయారు. రూ. 551 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశాయి ఫ్రాంచైజీలు. గ‌తంలో జ‌రిగిన ఐపీఎల్ లో త‌మ ప్ర‌తిభా పాట‌వాల‌తో స్టార్లుగా వెలుగొందారు ప‌లువురు క్రికెట‌ర్లు.

కానీ అలాంటి స్టార్లను ఈసారి పూర్తిగా ప‌ట్టించు కోలేదు. ఇందులో ప్ర‌ధానంగా విస్తు పోయేలా చేసింది తాజా, మాజీ క్రికెట‌ర్లు, క్రీడాభిమానుల‌ను. ఛాంపియ‌న్ గా నిలిచిన చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK CEO  )లో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌చ్చాడు సురేష్ రైనా.

దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డంతో సీఎస్కే యాజ‌మాన్యం స్పందించింది. బేస్ రేటుకే వేలం పాట‌కు వ‌చ్చినా రైనా వైపు ఏ ఫ్రాంచైజీ చూడ‌లేదు. రైనా అన్ సోల్డ్ గా మిగిలి పోయాడు.

గ‌త 12 సంవ‌త్స‌రాలుగా రాణిస్తూ వ‌చ్చాడు. కానీ ఇటీవ‌ల త‌ను పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. ఫామ్ ఆధారంగానే ఆటగాళ్ల‌ను ఎంపిక చేస్తాం. ఆడ‌ని వాళ్ల‌ను మోయ‌లేమంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు సీఎస్కే సిఇఓ కాశీ విశ్వనాథ్.

Also Read : స్టార్ ప్లేయ‌ర్ల‌తో గుజ‌రాత్ టైటాన్స్

Leave A Reply

Your Email Id will not be published!