Raja Gopal Reddy : అభ్యర్థుల ఆస్తుల్లో కోమటిరెడ్డి టాప్
నవంబర్ 10 దరఖాస్తుకు డెడ్ లైన్
Raja Gopal Reddy : తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోటా పోటీగా నామినేషన్లు వేస్తున్నారు. నవంబర్ 10న శుక్రవారం ఆఖరి రోజు కావడంతో భారీ ఎత్తున దరఖాస్తులు భారీగా దాఖలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అత్యధిక ఆదాయం కలిగిన వారిలో మాజీ ఎంపీ, ప్రస్తుతం మునుగోడు శాసనసభ నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
Raja Gopal Reddy Viral
అత్యధిక ఆదాయం కలిగిన అభ్యర్థులలో రాజగోపాల్ రెడ్డి(Raja Gopal Reddy) నెంబర్ 1గా నిలిచారు. తన అఫిడవిట్ లో రూ. 458 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. తాను పొందిన కాంట్రాక్టుల వివరాలు కూడా పొందు పరిచారు. విచిత్రం ఏమిటంటే 2018లో పోటీ చేసిన సమయంలో రూ. 314 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇటీవలే బీజేపీలోకి జంప్ అయ్యారు. మునుగోడులో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తీరా అక్కడ ఇముడలేక తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక రెండో స్థానంలో గులాబీ పార్టీకి చెందిన పైళ్ల సేశకర్ రెడ్డి తన ఆస్తులు రూ. 227 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. మూడో స్థానంలో రూ. 197 కోట్లు ఉన్నట్లు తెలిపారు.
Also Read : Nilam Madhu Mudiraj : బీఎస్పీలోకి నీలం మధు జంప్